ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ఘనత కేసీఆర్‌దే..
నర్మెటలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ అన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ హయాంలో మంజూరైనా రూ.1070 కోట్లను కాంగ్రెస్ ప్రభు త్వం రద్దు చేసిందని, ఆ నిధులు ఇచ్చిన తర్వాతనే సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు.
- హామీల అమలులో కాంగ్రెస్ సర్కారు విఫలం
- విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ
సిద్దిపేట,మార్చి18: నర్మెటలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ అన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ హయాంలో మంజూరైనా రూ.1070 కోట్లను కాంగ్రెస్ ప్రభు త్వం రద్దు చేసిందని, ఆ నిధులు ఇచ్చిన తర్వాతనే సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాణిక్యరెడ్డి, జాప శ్రీకాంత్‌రెడ్డి, కాముని శ్రీనివాస్, సోమిరెడ్డి, పాప య్య, రవీందర్‌రెడ్డి, కనకరాజు, కోల. రమేశ్‌గౌడ్, కాముని ఉమేశ్, ఇట్టబోయిన శ్రీనివాస్‌తో కలిసి సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవార ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడారు.
ఈ నెల 22న నర్మెటలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ప్రారంభించడానికి సీఎం రేవంత్‌రెడ్డి రావడం సిగ్గుచేటున్నారు. సిద్దిపేట ప్రజలను వంచించేందుకే సీఎం వస్తున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు విస్మరించి ప్రజలకు జవాబు చెప్పకుండా ఫ్యాక్టరీ ప్రారంభించడం సరికాదన్నారు. జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు, ఫ్యాక్టరీ నిర్మించిన ఘనత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుకే దక్కిందన్నారు. హామీల అమలులో కాంగ్రె స్ విఫలమైందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సాహంతో హరీశ్‌రావు రూ 300 కోట్లతో నర్మెటలో ఫ్యాక్టరీ మంజూరు చేయించారని గుర్తుచేశారు. లాభదాయకంగా ఉన్న ఆయిల్‌పా మ్ పంట సిద్దిపేట రైతులకు అందించే గొప్ప ప్రయత్నం చేశారన్నారు.
కేంద్ర ఏజెన్సీ ద్వారా భూముల స్థితిగతుల మీద ఎమ్మెల్యే హరీశ్‌రావు సర్వే చేయించారన్నారు. కేసీఆర్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుల ద్వారా జిల్లాలో తేమశాతంపై వచ్చిన నివేదిక పంటసాగుకు అనుకూలంగా వచ్చిందన్నారు. సిద్దిపేట జిల్లాలో 14వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగులో ఉందన్నారు. అందు లో 12500 ఎకరాలు బీఆర్ఎస్ హయాం లో సాగైందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 2000 ఎకరాలు మాత్రమే సాగులోకి వచ్చిందన్నారు. ఫ్యాక్టరీ నిర్మాణంకోసం హరీశ్‌రావు 90శాతం పను లు పూర్తి చేయిస్తే 10శాతం పనులు చేయించడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండున్నర ఏండ్లు పట్టిందన్నారు.సీఎం రేవంత్‌రెడ్డి సిద్దిపేట అభివృద్ధిపై కక్షకట్టి వెటర్నరీ కళాశాలను కొడంగల్‌కు తరలించారన్నారు. కోమటిచెరువు శిల్పారామం పనులు నిలిపివేశారన్నా రు. ఇల్లంతకుంట, చిన్నకోడూరు రోడ్డు పను లు, రూ. 125కోట్ల రంగనాయక సాగర్ టూరిజం పారు, ఆడిటోరియం నిధులు నిలిపివేశారని గుర్తుచేశారు. రైతులకు పంట రుణమాఫీ అమలు చేయాలన్నారు. సమావేశంలో నాయకులు బెదురు తిరుపతి, నరేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రంగరాజుపాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

