Akhanda 2 | నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ 2: తాండవం’ చిత్రం డిసెంబర్ 12న గ్రాండ్‌గా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఒక రోజు ముందుగా ప్రీమియర్ షోలు వేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే రిలీజ్‌కు ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉండగా కూడా పూర్తిస్థాయిలో బుకింగ్స్ ఓపెన్ చేయకపోవడం అభిమానుల్లో అసహనానికి దారితీసింది. ఇదే సమయంలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మరోసారి టికెట్ రేట్ల హైక్‌కు అనుమతి లభించడంతో, తాజాగా అన్ని ఏరియాల్లో బుకింగ్స్ వేగంగా ఓపెన్ అయ్యాయి.‘అఖండ 2’ను అసలు డిసెంబర్ 5న విడుదల చేయాలని భావించిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు అదనపు టికెట్ రేట్లకు అనుమతి ఇచ్చాయి. అయితే ఊహించని పరిణామాల కారణంగా సినిమా వాయిదా పడటంతో, స్పెషల్ రేట్ల కోసం మళ్లీ తాజా జీవోలు జారీ చేయాల్సి వచ్చింది.
ముందుగా ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జీవో విడుదల కావడంతో అక్కడే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా అదనపు టికెట్ ధరలు మరియు ప్రీమియర్ షోలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కొత్త జీవో జారీ చేసింది.తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్‌లో రూ.50 (జీఎస్టీతో కలిపి), మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 (జీఎస్టీతో కలిపి) చొప్పున అదనపు రేట్లు వసూలు చేసుకునేందుకు అనుమతి లభించింది. ఈ స్పెషల్ రేట్లు డిసెంబర్ 12 నుంచి 14 వరకు అమల్లో ఉంటాయి. అలాగే డిసెంబర్ 11 రాత్రి 8 గంటల నుంచి ప్రీమియర్ షోలు ప్రారంభించేందుకు అనుమతి లభించగా, ఈ ప్రీమియర్ టికెట్ ధరను జీఎస్టీతో కలిపి రూ.600 వరకు పెంచుకోవడానికి అవకాశం కల్పించారు. అదనపు రేట్ల ద్వారా వచ్చిన ఆదాయంలో 20 శాతం మూవీ ఆర్టిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌కి ఇవ్వాలని జీవోలో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో సింగిల్ స్క్రీన్స్‌లో రూ.75 (జీఎస్టీతో కలిపి), మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 (జీఎస్టీతో కలిపి) చొప్పున టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి లభించింది. ఈ రేట్లు డిసెంబర్ 12 నుంచి పది రోజులపాటు అమల్లో ఉంటాయి. అదేవిధంగా డిసెంబర్ 11న రాత్రి జరిగే ప్రీమియర్ షోల కోసం టికెట్ రేటును జీఎస్టీతో కలిపి రూ.600 వరకు పెంచుకోవచ్చని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. స్పెషల్ రేట్లతో పాటు బుకింగ్స్ పూర్తిగా ఓపెన్ కావడంతో, బాలయ్య అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ‘అఖండ 2’ కోసం హైప్ ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో, టికెట్ రేట్ల పెంపు కూడా కలెక్షన్లపై భారీ ప్రభావం చూపించే అవకాశముంది.