అడిలైడ్: ఇంగ్లండ్తో యాషెస్ సిరీస్ మూడో టెస్టుకు ఆస్ట్రేలియా రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్ ఎంపికయ్యాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న కమిన్స్ బుధవారం సీఏ ప్రకటించిన 15 మందితో కూడిన జట్టులో చోటు దక్కించుకున్నాడు.
ఈనెల 17 నుంచి ఇరు జట్ల మధ్య అడిలైడ్ వేదికగా మూడో టెస్టు మొదలుకానుంది.