Virat Kohli : కాన్పూర్‌లో డ్రా అవుతుందనుకున్న మ్యాచ్‌ను గెలిచి చూపించింది టీమిండియా. టీ20 తరహా విధ్వంసంతో బంగ్లాదేశ్‌ను వణికించిన భారత జట్టు చిరస్మరణీయ విజయం నమోదు చేసింది. స్వదేశంలో వరుసగా 18వ సిరీస్ విక్టరీతో చరిత్ర సృష్టించింది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ తుఫాన్‌లా విరుచుకుపడ్డ విరాట్ కోహ్లీ (Virat Kohli) మ్యాచ్ ముగియగానే ప్రత్యర్థి ఆటగాళ్లను కలిశాడు. ఓటమి బాధలో ఉన్న బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబుల్ హసన్(Shakib Al Hasan)ను ఓదార్చాడు. భారత్‌పై చివరి టెస్టు ఆడేసిన అతడికి విరాట్ ప్రత్యేక బహుమతి అందించాడు.
న్పూర్ టెస్టు సమయంలోనే టీ20లకు.. టెస్టులకు సైతం వీడ్కోలు ప్రకటించిన షకీబ్‌కు కోహ్లీ తన సంతకంతో కూడిన బ్యాట్‌ను బహూకరించాడు. దిగ్గజ ఆటగాడి నుంచి.. కెరీర్లో చివరి టెస్టు వేళ మర్చిపోలేని బహుమతి దక్కడంతో షకీబ్ సంబురపడిపోయాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ అనంతరం షకీబ్ సుదీర్ఘ ఫార్మాట్ నుంచి కూడా వైదొలిగే అవకాశముంది.
Virat Kohli presents a Bat to Shakib Al Hasan 😍💞#ViratKohli #ShakibAlHasan pic.twitter.com/oef8f6k4pA
— bdcrictime.com (@BDCricTime) October 1, 2024
టెస్టుల్లోనూ అసలైన మజా ఉందని భారత జట్టు కాన్పూర్‌లో మరోసారి నిరూపించింది. గెలుపు ఆశలు లేని స్థితి నుంచి అసమాన ఆటతో విజయ ఢంకా మోగించింది. టీ20లను తలపించేలా చెలరేగిన టీమిండియా కాన్పూర్ టెస్టులో 7 వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయంతో అభిమానులను మురిపించింది. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ను 233కే కట్టడి చేసిన భారత్.. అనంతరం మెరుపు బ్యాటింగ్‌తో ఆశ్చర్యపరిచింది.
Captain @ImRo45 collects the @IDFCFIRSTBank Trophy from BCCI Vice President Mr. @ShuklaRajiv 👏👏#TeamIndia complete a 2⃣-0⃣ series victory in Kanpur 🙌
Scorecard – https://t.co/JBVX2gyyPf#INDvBAN pic.twitter.com/Wrv3iNfVDz
— BCCI (@BCCI) October 1, 2024
యశస్వీ జైస్వాల్(72), కేఎల్ రాహుల్(68)ల విధ్వంసక ఆటకు విరాట్ కోహ్లీ(47) ఊచకోత తోడవ్వగా 285-9 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఆ తర్వాత జట్టును గెలిపించే బాధ్యతను బౌలర్లు సమర్ధంగాప పోషించారు. బుమ్రా(3/17), అశ్శిన్(3/50), జడేజా(3/34)లు విజృంభించగా బంగ్లాదేశ్ 146 పరుగులకే ఆలౌటయ్యింది. లంచ్ తర్వాత ఓపెనర్ యశస్వీ జైస్వాల్(51) అర్ధ శతంకంతో విరుచుకుపడగా 7 వికెట్ల విజయంతో సిరీస్‌ను 2-0తో పట్టేసింది. ఈ విక్టరీతో భారత్ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో అగ్రస్థానం పదిలం చేసుకుంది.
Team India 🇮🇳 has become the fastest team to score 50, 100, 150, 200 and 250 runs in the 147 years old history of test cricket 🤯
India is on the way for something historical and memorable 👏🏻
👉🏻 Image Credit – @Sport360#INDvsBAN #INDvBAN#INDvsBANTEST #Ashwin pic.twitter.com/FcxApJqhkE
— Richard Kettleborough (@RichKettle07) September 30, 2024