Rain Alert | తెలంగాణలో రెండురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అంచనా వేసింది. కొమరిన్ ప్రాంతంలోనున్న ఉపరితల ఆవర్తనం ఉత్తర ఇంటీరియర్ కర్నాటక వరకు తమిళనాడు మీదుగా ఉన్న సగటు సముద్రమట్టానికి 0.9 ఇలోమీటర్ల వరకు విస్తరించి ఉందని పేర్కొంది. మంగళవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కరుస్తాయని చెప్పింది. బుధవారం ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.