Viswam | టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) ప్రస్తుతం శ్రీను వైట్ల (Sreenu Vaitla) డైరెక్షన్లో విశ్వం (Viswam) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. Gopichand 32గా తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఇటీవలే విడుదలైన టీజర్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ చిత్రం అక్టోబర్ 11న గ్రాండ్‌గా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా శ్రీనువైట్ల వీడియో ఒకటి షేర్ చేశారు మేకర్స్.
నాగార్జున-శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన కింగ్ సినిమాలో బ్రహ్మానందం సింగింగ్ రియాలిటీ షో కాంపిటేషన్ సన్నివేశాలు ఎంతగా నవ్విస్తాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. శ్రీనువైట్ల మార్క్ కామెడీ టచ్‌తో సాగే డైలాగ్స్‌ను తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. ఇలాంటి సన్నివేశాలు మరోసారి రిపీట్ కాబోతున్నాయా.. అంటే అవుననే అంటున్నాడు శ్రీను వైట్ల.
ఐకానిక్ సీన్లు స్క్రిప్ట్‌లో రాసుకున్నవి కాదు.. అలాగే విశ్వంలో ఐకానిక్ సీన్లు రీక్రియేట్ చేయడం గురించి చాలా ఆలోచించాను. ఎందుకంటే.. అంటూ శ్రీను వైట్ల కామెంట్స్‌ను సస్పెన్స్‌లో పెడుతూ కట్ చేసిన ప్రోమో వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఫుల్ వీడియోను సాయంత్రం 5 :04 గంటలకు విడుదల చేయనున్నట్టు తెలియజేశారు మేకర్స్.
ఈ చిత్రాన్ని దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై పాపులర్ డిస్ట్రిబ్యూటర్ కమ్ ఎగ్జిబిటర్ వేణు దోనెపూడి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వ ప్రసాద్‌తో తెరకెక్కిస్తు్న్నారు. మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన జర్నీ ఆఫ్ విశ్వం వీడియో ఫన్, సీరియస్ ఎలిమెంట్స్‌తో సాగుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. ఈ మూవీలో కావ్యథాపర్ హీరోయిన్గా నటిస్తోండగా.. నరేశ్, ప్రగతి, వెన్నెల కిశోర్, షకలక శంకర్, అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
The magician behind many iconic comedy scenes, @SreenuVaitla Garu, reveals the secrets behind them all 💥💥
Full video out today at 5:04 PM ❤🔥#Viswam GRAND WORLDWIDE RELEASE on October 11th. pic.twitter.com/K2EYvR7EOC
— BA Raju’s Team (@baraju_SuperHit) October 1, 2024
NTR Neel | ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా కథ ఇదే.. హీరోయిన్ కూడా ఫైనల్.. !
Matka | సూపర్ స్టైలిష్‌గా వరుణ్ తేజ్.. మట్కా రిలీజ్ అనౌన్స్మెంట్ లుక్ వైరల్
Hari Hara Veera Mallu | హరి హర వీరమల్లుతో ఇస్మార్ట్ భామ.. విజయవాడలో నిధి అగర్వాల్ ల్యాండింగ్