లండన్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కాన్వాయ్‌పై కాంగ్రెస్ గుండాలు(Congress goons) చేసిన దాడి ఒక పిరికిపంద చర్యని ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎఫ్దీసీ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం(Anil Kurmachalam )అన్నారు. కేటీఆర్‌పై దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నేడు తెలంగాణలో నడుపుతున్న బుల్డోజర్ రాజకీయాన్ని వ్యతిరే కిస్తూ ప్రజలకు అండగా నిలవడానికి వెళ్తున్న కేటీఆర్‌పై కాంగ్రెస్ దాడికి దిగడం తెలంగాణ ప్రజల పై దాడిగా సమాజం చూస్తుందన్నారు.
తెలంగాణ ఉద్యమ నాయకుడు కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి పిట్ట బెదిరింపులకు భయపడే నాయకుడు కాదన్నారు. కేటీఆర్ రెట్టింపు ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్లి ప్రజా క్షేత్రంలోనే మీ సంగతి చెప్పే సత్తా ఉన్న నాయకుడు అని పేర్కొన్నారు. యావత్ తెలంగాణ సమాజం కేటీఆర్ వెంట ఉందని, ఇలాంటి చర్యలు మానకపోతే ప్రజలే తగిన బుద్ది చెప్తారని హెచ్చరించారు. ఇప్పటికైనా ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.