Team India : సుదీర్ఘ ఫార్మాట్ కళ తప్పింది? ఐదు రోజుల మ్యాచ్‌లో మజా ఏం ఉంటుంది? అనుకున్న అభిమానులకు అసలైన మజా టెస్టుల్లోనే ఉందని భారత జట్టు (Team India) మరోసారి నిరూపించింది. ఇంగ్లండ్ బజ్‌బాల్‌ను తలదన్నేలా.. టీ20లను తలపించేలా చెలరేగిన టీమిండియా కాన్పూర్ టెస్టు (Kanpur Test)లో చిరస్మరణీయ విజయంతో అభిమానులను మురిపించింది. వరుణుడు అడ్డుపడినా.. రెండు రోజులు బంతి పడకున్నాసంచలన ఆటతో బంగ్లాదేశ్‌కు ముచ్చెమటలు పట్టించింది. సొంతగడ్డపై ఆధిపత్యాన్ని చెలాయిస్తూ రికార్డు స్థాయిలో 18వ సిరీస్ అందుకుంది.
స్వదేశంలో తిరుగులేని రికార్డు ఉన్న టీమిండియా మళ్లీ పంజా విసిరిసింది. రెండో టెస్టులో ఓపెనర్ యశస్వీ జైస్వాల్(72, 51) సుడిగాలి ఇన్నింగ్స్‌కు.. స్పిన్ ద్వయం అశ్విన్(3/50), జడేజా(3/34) మ్యాజిక్ తోడవ్వగా టీమిండియా స్వల్ప లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించి సిరీస్ పట్టేసింది. రోహిత్ శర్మ బృందం కాన్పూర్‌లో అసాధ్యాన్ని సాధ్యం చేయడంతో.. స్వదేశంలో వరుసగా 18వ సిరీస్ టీమిండియా ఖాతాలో చేరింది. విశేషం ఏంటంటే.. టెస్టుల్లో మరే జట్టు సొంతగడ్డపై ఇన్ని సిరీస్‌లు గెలవలేదు.
Great performance by team India as they completed the series win 2-0. All our bowlers, @ashwinravi99, @imjadeja, @Jaspritbumrah93 have put on an incredible show in restricting the Bangladesh batters. The intent and aggression of our batters from the word go defined the test… pic.twitter.com/V0mJIXtkYo
— Jay Shah (@JayShah) October 1, 2024
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ రేసులో ముందున్న భారత జట్టు విధ్వంసక ఆటతో అగ్రస్థానాన్ని కాపాడకుంది. సొంతగడ్డపై రికార్డు సిరీస్‌లను కొల్లగొట్టిన జట్టుగా చరిత్రపుటల్లోకి ఎక్కింది. 2013 నుంచి 2024.. ఈ 11 ఏండ్ల కాలంలో భారత్ స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లలో 18 పర్యాయాలు ప్రత్యర్థులను మట్టికరిపించింది. ఇక వరల్డ్ నంబర్ 1 జట్లలో ఒకటైన ఆస్ట్రేలియా వల్ల కూడా కాని రికార్డు భారత్ సొంతమైంది.
Rishabh Pant hits the winning runs 💥
He finishes off in style as #TeamIndia complete a 7-wicket win in Kanpur 👏👏
Scorecard – https://t.co/JBVX2gyyPf#INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/Nl2EdZS9VF
— BCCI (@BCCI) October 1, 2024
కంగారూ టీమ్ 1994 నుంచి 2000 మధ్య వరసుగా 10 టెస్టు సిరీస్‌లు సాధించింది. అదే ఆసీస్ 2004 – 08 మధ్య కూడా పదో సిరీస్ కైవసం చేసుకుంది. ఒకప్పుడు ప్రమాదకర జట్టు అయిన వెస్టిండీస్ 1976-1986 కాలంలో వరుసగా 8 టెస్టు సిరీస్‌లతో రికార్డు సృష్టించింది. న్యూజిలాండ్ జట్టు కూడా 2017-20లో సొంతగడ్డపై వరుసగా ఎనిమిది టెస్టు సిరీస్ విజయాలతో ప్రత్యర్థులకు దడ పుట్టించింది.
కాన్పూర్ టెస్టులో పలు రికార్డులు బద్ధలు కొట్టిన భారత జట్టు 180వ విజయం నమోదు చేసింది. చెపాక్ టెస్టులో భారీ విజయంతో దక్షిణాఫ్రికా(179 టెస్టు) రికార్డు సమం చేసింది. ఇప్పుడు కాన్పూర్ విక్టరీతో రోహిత్ సేన 180వ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా 414 విజయాలతో అగ్రస్థానంలో ఉంది. క్రికెట్‌కు పుట్టినిల్లు అయిన ఇంగ్లండ్(397), వెస్టిండీస్(183)లు రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి.