విద్యారంగ నిర్వీర్యం సిగ్గుచేటు : ఏఐఎస్ఎఫ్
విద్యార్థుల ప్రాణత్యాగాలతో ఏర్పడిన రాష్ట్రంలో విద్యారంగాన్ని నిర్వీ ర్యం చేయడం సిగ్గుచేటని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ పేర్కొన్నారు.
హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): విద్యార్థుల ప్రాణత్యాగాలతో ఏర్పడిన రాష్ట్రంలో విద్యారంగాన్ని నిర్వీ ర్యం చేయడం సిగ్గుచేటని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ పేర్కొన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 12 ఏండ్లు గడుస్తున్నా విద్యార్థుల సమస్యలు పరిష్కారం కాకపోవడం దౌర్భా గ్యం. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే విద్యాశాఖకు మంత్రి లేకపోవడం కాంగ్రెస్ పాలనా వైఫల్యానికి నిదర్శనం. కొఠారి కమిషన్ సూచనల మేరకు విద్యారంగానికి బడ్జెట్లో 30 శాతం నిధులు కేటాయించాలి. ఇటీవల విద్యాశాఖ కమిషన్ సమర్పించిన నివేదికను బహిర్గతం చేసి, అందులోని అంశాలపై విద్యావేత్తలతో చర్చించాలి. పెండింగ్ రీయింబర్స్మెంట్, సాలర్షిప్లు విడుదల చేయాలి. పేద విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందించాలి’ అని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించడంతోపాటు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

