హైదరాబాద్ : మూసీ బాధితులను(Musi river) పరామర్శించేందుకు వెళ్తున్న కేటీఆర్‌పై(KTR) కాంగ్రెస్ రౌడీ మూకల(Congress rowdies) దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని సౌత్ ఆఫ్రికా శాఖ ఎన్నారై అధ్యక్షుడు గుర్రాల నాగరాజు తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్ష నాయకులపై అధికార పార్టీ నాయకులు దాడి చేయడమేనా ప్రజా పాలన అంటే అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి అప్రజాస్వామిక చర్యలకు ప్రజలు త్వరలోనే నిన్ను మూసీలో కలపడం ఖాయమని హెచ్చరించారు. కాగా, కాంగ్రెస్ కార్యకర్తలు మరోసారి రెచ్చిపోయారు. మూసీ- హైడ్రా బాధితులకు అండగా నిలబడ్డారని ఇప్పటికే హైదరాబాద్ తెలంగాణ భవన్ వద్ద ఆందోళనకు దిగిన కాంగ్రెస్ కార్యకర్తలు.. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారుపైనా దాడికి తెగబడ్డారు.
గోల్నాక మూసీ బాధితులను పరామర్శించేందుకు వెళ్తుండగా ముషీరాబాద్‌లో కేటీఆర్ కారును అడ్డుకున్నారు. ఆపై దాడికి యత్నించారు. అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది, బీఆర్ఎస్ కార్యకర్తలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కాంగ్రెస్ గూండాలు ఏ మాత్రం తగ్గలేదు. కొందరైతే ఏకంగా కారుపైకి ఎక్కి మరీ దురుసుగా ప్రవర్తించారు. చివరకు బీఆర్ఎస్ శ్రేణులు వారిని తన్ని తరిమివేశారు. అనంతరం అంబర్‌పేట గోల్నాక పరిధిలోని తులసీరామ్ నగర్ వెళ్లిన కేటీఆర్ అక్కడ మూసీ బాధితులను పరామర్శించారు.