Rishabh Pant : ఇంగ్లండ్ పర్యటనలో అద్భుతంగా రాణిస్తున్న భారత జట్టు వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) గాయపడ్డాడు. లార్డ్స్ టెస్టు రెండో సెషన్ సమయంలో అతడి ఎడమ చేతి చూపుడు వేలికి బంతి బలంగా తాకింది. ప్రస్తుతం అతడు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. దాంతో, పంత్ మళ్లీ మైదానలోకి ఎప్పుడు వస్తాడు? అనేది తెలియడం లేదు.
అసలేం జరిగిందంటే.. జస్ప్రీత్ బుమ్రా వేసిన 34వ ఓవర్లో లెగ్ సైడ్ పడిన బంతి బౌండరీ వెళ్లకుండా ఆపే ప్రయత్నంలో పంత్ ఎడమవైపు జంప్ చేశాడు. ఆ సమయంలో బంతి అతడి చూపుడు వేలిని తాకుతూ వెళ్లింది. బాల్ గట్టిగా తాకడంతో నొప్పితో విలవిలలాడిన పంత్‌ను ఫీజియో పరీక్షించాడు. తాత్కాలికంగా వైద్యం చేసినా నొప్పి తగ్గకపోవడంతో వైస్ కెప్టెన్ మైదానం వీడాడు.
Update: #TeamIndia vice-captain Rishabh Pant got hit on his left index finger.
He is receiving treatment at the moment and under the supervision of the medical team.
Dhruv Jurel is currently keeping wickets in Rishabh’s absence.
Updates ▶️ https://t.co/X4xIDiSmBg #ENGvIND pic.twitter.com/MeLIgZ4MrU
— BCCI (@BCCI) July 10, 2025
పంత్ ఆరోగ్యంపై బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. ‘మూడో టెస్టు సందర్భంగా వైస్ కెప్టెన్ పంత్ ఎడమ చేతి చూపుడు వేలికి గాయమైంది. ప్రస్తుతం అతడికి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. బీసీసీఐ వైద్య బృందం పంత్‌ను పర్యవేక్షిస్తోంది. అతడు డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితం కావడంతో బ్యాకప్ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ గ్లోవ్స్ అందుకున్నాడు’ అని బీసీసీఐ పోస్ట్‌లో రాసుకొచ్చింది. తొలి సెషన్ ఆరంభంలోనే ఇంగ్లండ్ ఓపెనర్లను పెవిలియన్ చేర్చాడు పంత్. నితీశ్ కుమార్ రెడ్డి ఓవర్లో బెన్ డకెట్(23), జాక్ క్రాలే(18)లు ఇచ్చిన క్యాచ్‌ను ఒడుపుగా అందుకొని భారత్‌ను పోటీలోకి తెచ్చాడీ వికెట్ కీపర్.