నల్లగొండ రూరల్, జులై 10 : అధికారుల చేతులు తడిపి ఖాజీరామారంలో అక్రమ వెంచర్ ఏర్పాటు అని ఇటీవల నమస్తే తెలంగాణ దినపత్రిక జిల్లా పేజీలో ప్రచురితమైన కథనానికి ఎట్టకేలకు అధికారులు స్పందించారు. తాసీల్దార్ పరశురాం ఆదేశాల మేరకు గురువారం ఆర్ఐ గౌస్ అలీ, సర్వేయర్ సైదులు సర్వే నంబర్ 23, 24, 26 లో సర్వే చేశారు. అదేవిధంగా 25 సర్వే నంబర్లో ఉన్న ప్రభుత్వ భూమిని సర్వే చేశారు. అయితే సర్వే చేసే క్రమంలో స్థానిక కాంగ్రెస్ నేత అక్కడే ఉండడం గమనార్హం. సర్వే వివరాలు, పూర్తిస్థాయి నివేదికను తాసీల్దార్కు రెండు రోజుల్లో అందజేస్తామని ఆర్ఐ వెల్లడించారు.