AP Council | ఏపీ శాసనమండలిలో మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై దుమారం
AP Council | ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాల్లో బుధవారం గందరగోళం పరిస్థితి ఏర్పడింది.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనమండలి (AP Council ) సమావేశాల్లో బుధవారం గందరగోళం పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు( Minister Acchennaidu ) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. తిరుమల లడ్డూ ( Tirumala Laddu ) కల్తీ వ్యవహారంలో చర్చకు కూటమి ప్రతిపాదించగా మండలి చైర్మన్ మోషన్ రాజు అనుమతించారు.
వైసీపీ సభ్యులు చర్చను కొనసాగిస్తూ కొందరు తిరుమల లడ్డూ కల్తీ కూటమి పాలనలో జరిగిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.వైసీపీ సభ్యులు హెరిటేజ్ సంస్థపై చేసిన ఆరోపణలను మంత్రి లోకేష్‌తో పాటు అచ్చెన్నాయుడు తదితరులు తిప్పికొట్టారు. అయితే తిరుమల దేవదేవుడిపై అచంచల భక్తి, విశ్వాసం తమకు ఉందని అన్నారు. వైసీపీ సభ్యులు హిందూయిజం, వేంకటేశ్వరస్వామిపై కక్ష గట్టి పనిచేస్తారని ఊహించలేదని అన్నారు. మండలి చైర్మన్ క్రిస్టియన్, వైసీపీ నాయకుడు క్రిస్టియన్ అని ఈ విషయంలో తాను తప్పుబట్టడం లేదని, వేంకటేశ్వరస్వామి పవిత్రతతను దారుణంగా దెబ్బతీసున్నారని అన్నారు.
దీంతో మండలి చైర్మన్‌తో పాటూ వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో కులాలు, మతాల ప్రస్తావన తీసుకురావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను క్రిస్టియన్ కాదని మండలి చైర్మన్ వెల్లడించారు. సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయగా అచ్చెన్నాయుడు తిరస్కరించారు.
దీంతో చాలాసేపు సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మీరు క్రిస్టియన్ కాదని చెబితే తాను క్షమాపణ చెబుతానని చైర్మన్‌కు మంత్రి సమాదాన మిచ్చారు. తాను క్రిస్టియన్ కాదని హిందూవునని తెలిపారు. తాను క్రిస్టియన్ అనుకుని మంత్రి సంభాషించినట్లు సమాధానమిచ్చారని వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

