IND vs ENG : లార్డ్స్‌లో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ వరుసగా వికెట్లు కోల్పోతోంది. తొలి సెషన్లో రెండు వికెట్లు తీసిన భారత బౌలర్లు.. మూడో సెషన్లో మరో రెండు వికెట్లతో ఆతిథ్య జట్టును దెబ్బకొట్టారు. ఓపెనర్లు వెనుదిరిగాకా జిడ్డులా క్రీజను అంటుకుపోయిన ఓలీ పోప్ (44)ను టీ బ్రేక్ తర్వాత రవీంద్ర జడేజా (1-12) వెనక్కి పంపగా.. కాసేపటికే హ్యారీ బ్రూక్(11)ను బుమ్రా బౌల్డ్ చేశాడు. అంతే.. 172 వద్ద ఇంగ్లండ్ నాలుగో వికెట్ పడింది. సహచరులు పెవిలియన్‌కు క్యూ కడుతున్నా జో రూట్(62 నాటౌట్) అర్ధ శతకంతో జట్టును ఆదుకున్నాడు. అతడికి జోడీగా కెప్టెన్ బెన్ స్టోక్స్ మరో భాగస్వామ్యం నిర్మించే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోర్.. 172/4.
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లండ్ తొలి సెషన్లోనే తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (2-35) విజృంభణతో కష్టాల్లో పడింది. ఒకే ఓవర్లో ఓపెనర్లు డెన్ డకెట్(23) జాక్ క్రాలే(18) పెవిలియన్ చేరిన వేళ.. అనుభవజ్ఞుడైన జో రూట్(62 నాటౌట్), ఓలీ పోప్(44)లు టీమిండియా పేసర్లను కాచుకుంటూ వికెట్ కాపాడుకున్నారు.
It’s Tea on opening Day of the third #ENGvIND Test!
England move to 153/2.
Third & final session of the Day to commence 🔜
Updates ▶️ https://t.co/X4xIDiSmBg#TeamIndia pic.twitter.com/ojMHsYUtlS
— BCCI (@BCCI) July 10, 2025
వీళ్లిద్దరూ మూడో వికెట్‌కు విలువైన రన్స్ రాబట్టి ఆతిథ్య జట్టును ఆదుకున్నారు. దాంతో, ఇంగ్లండ్ 2 వికెట్ల నష్టానికి 83 పరుగులతో లంచ్‌కు వెళ్లింది. భోజన విరామం తర్వాత కూడా ఈ ద్వయం భారత బౌలర్లను విసిగించింది. రెండో సెషన్ అంతా ఆడిన రూట్ పోప్లు ఇంగ్లండ్‌ను పటిష్ట స్థితిలో నిలిపారు. అయితే.. టీ బ్రేక్ తర్వాత జడ్డూ పోప్‌ను ఔట్ చేసి స్టోక్స్ బృందాన్ని ఒత్తిడిలోకి నెట్టాడు.