Nitish Kumar Photo On Woman Voter Card | మహిళా ఓటర్ కార్డుపై సీఎం నితీశ్ కుమార్ ఫొటో.. వెల్లువెత్తిన విమర్శలు
Nitish Kumar Photo On Woman Voter Card | ఒక మహిళా ఓటరు కార్డుపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఫొటో ఉన్నది. ఇది చూసి ఆ మహిళ, ఆమె భర్త షాక్ అయ్యారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులపై వారు మండిపడ్డారు.
పాట్నా: ఒక మహిళా ఓటరు కార్డుపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఫొటో ఉన్నది. (Nitish Kumar Photo On Woman Voter Card) ఇది చూసి ఆ మహిళ, ఆమె భర్త షాక్ అయ్యారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులపై వారు మండిపడ్డారు. ఓటరు కార్డుల్లో తప్పులపై విమర్శలు వెల్లువెత్తాయి. బీహార్లో తర్వలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో మాధేపుర మున్సిపాలిటీకి చెందిన 30 ఏళ్ల అభిలాష కుమారి తన ఓటరు కార్డులో చిరునామా మార్పించుకున్నది. దీంతో పోస్ట్ ద్వారా కొత్త ఓటరు కార్డు ఆమెకు చేరింది.
కాగా, కొత్త ఓటరు కార్డు చూసి అభిలాష కుమారి షాక్ అయ్యింది. అందులో ఆమె పేరు, చిరునామా సరిగానే ఉన్నాయి. అయితే ఆమె ఫొటో బదులు సీఎం నితీశ్ కుమార్ ఫొటో ఉన్నది. దీంతో కంగారుపడిన అభిలాష కుమారి తన భర్తతో కలిసి బూత్ స్థాయి అధికారిని కలిసింది. ఆ ఓటరు కార్డులో సీఎం నితీశ్ ఫొటో గమనించిన ఆయన ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని కోరాడు. ఈ పొరపాటుపై దర్యాప్తు జరుపుతామని చెప్పాడు.
మరోవైపు తన భార్య ఓటరు కార్డులో సీఎం నితీశ్ కుమార్ ఫొటో ఉండటంపై అభిలాష కుమారి భర్త చందన్ కుమార్ మండిపడ్డాడు. ప్రభుత్వం, సంబంధిత సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. మరికొన్ని ఓటరు కార్డుల్లో కూడా ఇలాంటి చాలా తప్పులు కనిపించాయి. దీంతో సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు విమర్శించాయి.
Also Read:
Fake Poll Officials | ఫొటో కోసం మెడలోని గొలుసు తీయమని చెప్పి.. చోరీ చేసిన నకిలీ ఎన్నికల సిబ్బంది
Watch: తృణమూల్ నేత, బీజేపీ నాయకురాలు కలిసి.. కారులో మద్యం తాగిన వీడియో వైరల్
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bihar
- Curious
- Name
- Nitish Kumar
RELATED ARTICLES
తాజా వార్తలు
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

