నమస్తే తెలంగాణ యంత్రాంగం, మార్చి 29 : జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో హోలీ పండుగను ప్రజలు సోమవారం ఉత్సాహంగా జరుపుకొన్నారు. కొన్ని గ్రామాల్లో ఆదివారం హోలీ నిర్వహించుకోగా.. మరికొన్ని గ్రామాల్లో సోమవారం నిర్వహించుకున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ఆదివారం రాత్రి కామదహనం నిర్వహించి సోమవారం హోలీ పండుగను ఘనంగా జరుపుకొన్నారు.
బీర్కూర్ మండలంలోని బరంగేడ్గి, బీర్కూర్, కిష్టాపూర్, చించోలి మినహా మిగిలిన గ్రామాల్లో హోలీ పండుగను సోమవారం జరుపుకొన్నారు. నస్రుల్లాబాద్ మండలంలోని మైలారం, కంశెట్‌పల్లి, హాజీపూర్ గ్రామాల్లో హోలీ జరుపుకొన్నారు. నిజాంసాగర్ మండలంలోని నర్సింగ్‌రావుపల్లి గ్రామంలో నిర్వహించిన హోలీ వేడుకల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ పాల్గొన్నారు.
పిట్లం మండలంలోని చిన్నకొడప్గల్, తిమ్మానగర్, అల్లాపూర్, పారడ్పల్లి, అన్నారం, రాంపూర్ గ్రామాల్లో హోలీ పండుగను ఘనంగా నిర్వహించారు. ఎల్లారెడ్డి పట్టణంలో ఆదివారం రాత్రి 12 గంటలకు కలాల్గల్లీలో ప్రారంభించిన కామదహనంతో హోలీ వేడుకలు ప్రారంభమయ్యాయి. పట్టణంలోని గాంధీచౌక్‌లో వ్యాపారులు వివిధ రకాల రంగులను విక్రయించారు. ఈ ఏడాది సంప్రదాయ రంగులు ఎక్కువగా హోలీలో వాడారు. సదాశివనగర్ మండలంలోని ఉత్తునూర్ గ్రామంలో హోలీ సంబురాలను యువకులు ఘనంగా జరుపుకొన్నారు. లింగంపేట మండలంలోని ముస్తాపూర్, అయ్యపల్లి, శెట్పల్లి, బాణాపూర్, మోతె, నల్లమడుగు, పర్మళ్ల, శెట్పల్లిసంగారెడ్డి, భవానీపేట గ్రామాలతోపాటు గిరిజన తండాల్లో హోలీ సంబురాలు ఘనంగా నిర్వహించారు.
ఇవీ కూడా చదవండి..
చిప్‌ల కొరత. పీఎల్ఐ లక్ష్యాలకు ‘స్మార్ట్ ఫోన్లు’ దూరం!
ఇండ్లకు డిస్కౌంట్ల బోనంజా.. దేశమంతా ‘డబుల్’ ప్రియారిటీ!