SL vs NZ : స్వదేశంలో చెలరేగి ఆడుతున్న శ్రీలంక (Srilanka) మరో వన్డే సిరీస్ పట్టేసింది. వర్షం కారణంగా మంగళవారం న్యూజిలాండ్ (Newzealand)తో జరగాల్సిన మూడో వన్డే రద్దు అయింది. దాంతో, వరుసగా రెండు వన్డేల్లో గెలుపొందిన ఆతిథ్య లంక 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. 21 ఓవర్ ముగిశాక మొదలైన వాన ఎంతకూ తగ్గలేదు. దాంతో రిఫరీలు ఇరుజట్ల కెప్టెన్లతో మాట్లాడి మ్యాచ్‌ను రద్దు చేశారు.
అనంతరం నిర్వాహకులు శ్రీలంక సారథి చరిత అసలంకకు ట్రోఫీ అందించారు. తద్వారా ఈ ఏడాది లంకజట్టు ఐదో వన్డే సిరీస్ ట్రోఫీని ముద్దాడింది. ఈ మూడు వన్డేల సిరీస్‌లో శతకంతో చెలరేగిన కుశాల్ మెండిస్ (Kushal Mendis) ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా ఎంపికయ్యాడు.
The third #SLvNZ ODI has been called off due to rain. Sri Lanka take the series 2-0 🇱🇰
SCORECARD: https://t.co/ykdCg7FRjy pic.twitter.com/BCNAcfQik6
— ESPNcricinfo (@ESPNcricinfo) November 19, 2024
టెస్టు సిరీస్‌లో న్యూజిలాండ్‌ను వైట్‌వాష్ చేసిన శ్రీలంక పొట్టి, వన్డే సిరీస్‌లను సైతం కైవసం చేసుకుంది. మంగళవారం పల్లెకెలె స్టేడియంలో నామమాత్రమైన మూడో వన్డేకు వర్షం అంతరాయం కలిగించింది. అప్పటికి కివీస్ స్కోర్.. 112-1. ఓపెనర్ టిమ్ రాబిన్సన్(9) విఫలమైనా విల్ యంగ్(56 నాటౌట్), హెన్రీ నికోలిస్(46 నాటౌట్)లు ధాటిగా ఆడారు. వీళ్ల పరుగుల వరదకు అడ్డుపడిన వరుణుడు లంకకు బ్రేకిచ్చాడు.
A fifty for Will Young as New Zealand build a platformhttps://t.co/ykdCg7FRjy #SLvNZ pic.twitter.com/02oJD8NpEX
— ESPNcricinfo (@ESPNcricinfo) November 19, 2024
దాంతో, వాన తగ్గేతే ఓవర్లు కుదించి అయినా మ్యాచ్ జరపాలని అంపైర్లు భావించారు. కానీ, ఎంతకూ చినుకులు ఆగలే. ఇక చేసేదేమీలేక అంపైర్లు, రిఫరీలు మ్యాచ్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. రెండు మ్యాచుల్లో జయభేరి మోగించిన శ్రీలంకకు ట్రోఫీని బహూకరించారు.