Jathara | దేవుడు ఆడే జగన్నాటకం.. ఆ దేవునితో మనిషి ఆడించే పితలాటకం అంటూ ఫస్ట్ లుక్‌తోనే క్యూరియాసిటీ పెంచేసిన చిత్రం జాతర (Jathara). సతీశ్ బాబు రాటకొండ స్వీయ దర్శకత్వంలో నటించిన ఈ మూవీ నవంబర్ 8న విడుదలైంది. చిన్న సినిమాగా వచ్చిన జాతరకు సూపర్ రెస్పాన్స్ రావడం పట్ల మూవీ టీం సెలబ్రేట్ చేసుకుంటోంది.
ఒకే రోజు 10 సినిమాలు విడుదలైనప్పటికీ జాతరను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు సతీశ్ బాబు శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నట్టు తెలిపాడు. చిన్న సినిమాకు ఇంత గుర్తింపు రావడం అంత సులభమైన విషయం కాదు. వారం పాటు నాన్‌స్టాప్‌గా స్క్రీనింగ్ అవుతూ విజయవంతంగా రెండో వారంలోకి అడుగుపెట్టడం పట్ల తాము చాలా గర్వంగా ఫీలవుతున్నామని నిర్మాత ద్వారంపూడి శివశంకర్ రెడ్డి అన్నాడు.
అమ్మోరు తల్లి ఊరు వదిలి వెళ్లిపోయిందహో. అమ్మోరు నీ ఇంట్లో గొడ్డు అనుకున్నావా..? తోలేసుకుని బతికే వాళ్లమే కానీ తోలు అమ్ముకొని బతికే వాళ్లం కాదంటూ.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సినిమాపై హైప్ పెంచేశాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
చిత్తూరు బ్యాక్ డ్రాప్లో సాగే జాతర నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీని గల్లా మంజునాథ్ సమర్పించగా.. రాధాకృష్ణ ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై ఎల్ఎల్సీతో కలిసి రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో దియారాజ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. గోపాల్ రెడ్డి, మహబూబ్ బాషా, సాయి విక్రాంత్, ఆర్కే పిన్నపాల ఇతర పాత్రల్లో నటించారు. శ్రీజిత్ ఎడవణ సంగీతం అందించారు.
పది సినిమాలు అదే రోజు రిలీజ్ అవడం – మా జాతర సినిమా కి థియేటర్స్ అనుకున్న స్థాయిలో దొరకకపోయిన మా జాతర మూవీ ని ప్రేక్షకులు ఆదరించినందుకు శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను – హీరో డైరెక్టర్ సతీష్ బాబు #Jathara @yourSathishbabu #DeeyaRaj #GallaManjunath #RadhakrishnaReddy… pic.twitter.com/Piqw6ekmrZ
— Sai Satish (@PROSaiSatish) November 18, 2024
RAPO 22 | సైకిల్ తోసుకుంటూ వెళ్తున్న రామ్ పోతినేని.. RAPO 22 ప్రీ లుక్ వైరల్
Pushpa 2 The Rule | పుష్ప 2 ది రూల్ రిలీజ్ ఆన్ ది వే.. తెలుగు ప్రేక్షకులకు బ్యాడ్ న్యూస్..!