Team India : సుదీర్ఘ ఫార్మాట్లో భారత జట్టు చరిత్ర సృష్టించింది. అత్యంత చెత్త ప్రదర్శనతో 46 పరుగులకే ఆలౌట్ అయిన మరునాడే టెస్టు క్రికెట్లో తమకు తిరుగులేదని చాటుతూ మరో రికార్డు సొంతం చేసుకుంది. ఒక ఏడాదిలో ‘వంద సిక్సర్లు’ (Hundred Sixers) కొట్టిన తొలి జట్టుగా టీమిండియా (Team India) రికార్డుపుటల్లోకి ఎక్కింది. చిన్నస్వామి స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఈ ఘనతకు చేరువైంది. అజాజ్ పటేల్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ (Virat Kohli) బంతిని స్టాండ్స్‌లోకి పంపాడు. దాంతో రోహిత్ సేన 100 సిక్సర్లతో రికార్డు నెలకొల్పింది.
టీమిండియా వంద సిక్సర్ల రికార్డులో సింహ భాగం ఎవరిదో తెలుసా..? కుర్ర ఓపెనర్ యశస్వీ జైస్వాల్‌ది. ఈ ఏడాది భీకర ఫామ్‌లో ఉన్న ఈ యువతరంగం 29 సిక్సర్లతో టాప్‌లో కొనసాగుతున్నాడు. శుభ్‌మన్ గిల్ 16, రోహిత్ శర్మ 11 సిక్సర్లతో వరుసగా రెండు మూడో స్థానాల్లో నిలిచారు. ఈ ఏడాది అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ 8, ధ్రువ్ జురెల్‌లు 7 సిక్సర్లు బాదారు.
FIFTY!
Sarfaraz Khan with a stroke filled half-century.
His fourth in Test cricket 👏👏
Live – https://t.co/FS97LlvDjY… #INDvNZ@IDFCFIRSTBank pic.twitter.com/gMrP3ZEflC
— BCCI (@BCCI) October 18, 2024
ఇక కారు యాక్సిడెంట్ అనంతరం జట్టులోకి వచ్చిన రిషభ్ పంత్ 4 సిక్సర్లతో మెరవగా.. కేఎల్ రాహుల్ సైతం నాలుగు పర్యాయాలు బంతిని స్టాండ్స్‌లోకి పంపాడు. విరాట్ కోహ్లీతో పాటు యువ పేసర్ ఆకాశ్ దీప్, సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌లు తలా మూడేసీ సిక్సర్లతో వంద రికార్డులో భాగమయ్యారు.