KTR | హైదరాబాద్ : మూసీ సుందరీకరణపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజుకో మాట మాట్లాడుతూ.. అపరిచితుడిలాగా మారిపోయాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మూసీ సుందరీకరణ చేస్తాం అని మొట్టమొదట చెప్పిందే రేవంత్ రెడ్డి.. కానీ నిన్న ప్రెస్ మీట్లో అసలు సుందరీకరణ మాట ఎక్కడి నుంచి వచ్చిందని అంటున్నాడని కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ భవన్లో మూసీపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
రేవంత్ రెడ్డి ఒక రోజు సుందరీకరణ అంటాడు.. మరొక రోజు ప్రక్షాళన అంటాడు.. మరో రోజు పునరుజ్జీవం అంటాడు అని కేటీఆర్ తెలిపారు. మూసీ సుందరీకరణ అనే మాట మొట్టమొదటు వాడింది రేవంత్ రెడ్డి. గోపన్‌పల్లిలో మాట్లాడుతూ లక్షన్నర కోట్లతో మూసీ సుందరీకరణ చేస్తామని చెప్పారు. కానీ ఇవాళ ఆయన ఒక అపరిచితుడిలా మారారు. ఆయన నోట్లో నుంచి అబద్ధాలు వస్తున్నాయి. లక్షన్నర కోట్లు ఎవరు అన్నారని అంటుండు. నల్లగొండకు మంచినీళ్లు ఇస్తుంటే మీకు మనసున పడుతలేదా అంటున్నాడు. నల్లగొండ జిల్లా ప్రజలను రెచ్చగొడుతున్నాడని కేటీఆర్ ధ్వజమెత్తారు.
మూసీ ప్రక్షాళన ఇష్టం లేదని మీరంటే ఖర్చు పెట్టిన రూ. 140 కోట్లు నా ఆస్తి అమ్మైన కడుతా అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. రేవంత్ రెడ్డి అఫిడవిట్లో ఏమో రూ. 30 కోట్లే తన ఆస్తి అని చూపించాడు. మరి రూ. 140 కోట్లు తమ్ముడి స్వచ్ బయో కంపెనీ నుండి తేస్తాడా, బావమరిది అమృత్ కంపెనీ నుండి అమృతం ఏమైనా జుర్రుతాడా? అని కేటీఆర్ విమర్శించారు.
ఇవి కూడా చదవండి..
KTR | సీఎం రేవంత్ రెడ్డితో ఏకీభవిస్తున్నా.. మూసీని మురికికూపంగా మార్చింది గత పాలకులే : కేటీఆర్
Group-1 Mains | షెడ్యూల్ ప్రకారమే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు.. పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు