Kaun Banega Crorepati – Allu Arjun | బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా చేస్తున్న సక్సెస్ఫుల్ గేమ్ షో కౌన్ బనేగా కరోడ్ పతి(Kaun Banega Crorepati). ఇప్పటికే ఈ షోకి సంబంధించి 15 సీజన్లు రాగా రికార్డు వ్యూస్ అందుకున్నాయి. ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్ పతి 16 వ సీజన్ రన్ అవుతుంది. ఈ సీజన్లో ఇప్పటికే ఒలింపిక్ మెడలిస్ట్ మను భాకర్ హాజరై సందడి చేసింది. ఇదిలావుంటే తాజాగా ఈ షోలో అమితాబ్ బచ్చన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు సంబంధించి ఒక ప్రశ్న వేశాడు.
‘2023’లో నేషనల్ అవార్డు గెలుచుకున్న నటుడు ఎవరు’ అని అమితాబ్ అడిగారు. దానికి కంటెస్టెంట్ అల్లు అర్జున్ అని సరైన సమాధానం చెప్పి రూ.20 వేలు గెలుచుకున్నారు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన చిత్రం పుష్ప ది రైజ్. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. తెలుగులో కన్న హిందీలోనే ఎక్కువ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. అయితే ఈ సినిమాలో నటనకు గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్నాడు. ప్రస్తుతం పుష్ప ది రూల్ అంటూ సీక్వెల్‌తో రాబోతున్నాడు అల్లు అర్జున్. ఈ చిత్రం డిసెంబర్ 06న ప్రేక్షకుల ముందుకు రానుంది.
A question worth 20,000 on KBC about Allu Arjun 🔥#KaunBanegaCrorepati#Pushpa2TheRule #AlluArjun #AmitabhBachchan#Srivalli
pic.twitter.com/oeDO5o5zHN— Telugu Chitraalu (@TeluguChitraalu) October 18, 2024