Srilanka Cricketers : ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న శ్రీలంక క్రికెటర్ల(Srilanka Cricketers)కు టెస్టు సిరీస్ కంటే ముందే ఓ భయం పట్టుకుంది. లంక ఆటగాళ్లు తమ భద్రతపై ఆందోళన చెందుతున్నారు. గత కొన్ని రోజులుగా వలసదారుల(Anti immigrants)కు వ్యతిరేకంగా ఇంగ్లండ్ ప్రజలు అల్లర్లకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో లంక ఆటగాళ్లు ఒకింత కంగారు పడుతున్నారు. ఇదే విషయాన్ని వాళ్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) దృష్టికి తీసుకెళ్లారు. దాంతో, ఈసీబీ మేము మీకు పూర్తి భద్రత కల్పిస్తాం. ఆందోళన అవసరం లేదు అని భరోసా ఇచ్చింది.
వన్డే సిరీస్‌లో టీమిండియాను చిత్తుగా ఓడించిన లంక త్వరలోనే ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ఆడనుంది. మూడు టెస్టుల సిరీస్ కోసం ఇప్పటికే తొమ్మిది మంది (ఏడుగురు క్రికెటర్లు, ఇద్దరు సహాయక సిబ్బంది)తో కూడిన లంక బృందం ఇంగ్లండ్ చేరుకుంది. అయితే.. అక్కడ భయానక పరిస్థితులు నెలకొనడంతో శ్రీలంక ఆటగాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తూ ఈసీబీని ఆశ్రయించారు.
Sri Lanka’s Test players who have arrived in England early have raised concerns about their safety amid anti-immigrant riots across the country.
The ECB’s full security plan is set to kick in when the rest of the squad arrive on Sunday: https://t.co/mQe5GpUdgU pic.twitter.com/ZTK1D74I3Z
— ESPNcricinfo (@ESPNcricinfo) August 8, 2024
‘మేము ఉంటున్న ప్రాంతానికి దూరంగానే అల్లర్లు జరుగుతున్నాయి. కానీ, ఆటగాళ్లంతా కొంత భయంగానే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మేము హోటల్ దాటి బయటకు వెళ్లలేకున్నాం’ అని ఒక లంక క్రికెటర్ తెలిపాడు. దాంతో, మీ భద్రత పూచీ మాది అంటూ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వాళ్లకు భరోసానిచ్చింది. శ్రీలంక, ఇంగ్లండ్‌ల మధ్య ఆగస్టు 21వ తేదీన మాంచెస్టర్‌లో తొలి మ్యాచ్ జరుగనుంది. అనంతరం ఆగస్టు 29న రెండో టెస్టు లార్డ్స్ (Lords)లో, సెప్టెంబర్ 6న ఓవల్ మైదానంలో మూడో టెస్టు నిర్వహించనున్నారు.