బొంబాయి రవ్వ: రెండు కప్పులు
చక్కెర: ముప్పావు కప్పు
యాలకులు: రెండు మూడు
ఉప్పు: తగినంత
కారం: పావు స్పూను
వాము,జీలకర్ర: కొద్దిగా
నెయ్యి: ఒకటిన్నర టేబుల్ స్పూన్
నూనె: పావుకిలో
ముందుగా బొంబాయి రవ్వను పిండిలా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. చక్కెరను కూడా పొడి చేసి పెట్టుకోవాలి. రవ్వను పిండి చేసినప్పుడు సగం పిండితో హాట్, సగం పిండితో స్వీట్ చేసుకోవచ్చు. స్వీట్ కోసం… కప్పు పిండిలో, పొడి చేసిన చక్కెరను వేసి, ఇలాచీలు దంచి వేసుకోవాలి. నెయ్యిని కరగబెట్టి ఈ మిశ్రమంలో వేసి, కొద్దిగా నీళ్లు పోసి గట్టిగా కలుపుకోవాలి. హాట్ కోసం… కప్పు పిండి తీసుకొని వాము, కారం, జీలకర్ర తగినంత ఉప్పు వేసి ఒకటిన్నర టేబుల్ స్పూన్ నూనె వేసి, కొద్దిగా నీళ్లు చల్లి బాగా కలుపుకోవాలి.
రెండు మిశ్రమాలనూ ఒక అరగంట పాటు మూత పెట్టి వదిలేయాలి. తర్వాత ఉండలు చేసుకుని పల్చగా ఒత్తి డైమండ్లలాగా కత్తిరించుకోవాలి. పొయ్యి మీద బాణలి పెట్టి నూనె పోసి కాగనిచ్చి వీటిని వేయించుకోవాలి. చిన్న మంటలో బంగారు రంగు వచ్చేదాకా వేయిస్తే కరకరలాడతాయి. తీపి వాటిని వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా పొడిచక్కెరలో పొర్లిస్తే… పాకం పట్టినట్టు రుచిగా ఉంటాయి. అవసరం లేదనుకుంటే నేరుగా అయినా తినొచ్చు. మైదా లేకుండా స్నాక్స్ చేసుకోవాలనుకుంటే ఇలా ట్రై చేస్తే సరి!