వీణవంక, డిసెంబర్ 13 : కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని బ్రాహ్మణపల్లికి చెందిన 13 ఏళ్ల బత్తుల విశ్వదీప్ జాతీయ స్థాయి హాకీ పోటీలకు ఎంపికయ్యాడు. హుజూరాబాద్ పట్టణంలోని మాంటిస్సోరి పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విశ్వదీప్..
ఈ నెల 12న వనపర్తి జిల్లాలో జరిగిన అండర్-14 ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి క్రీడాపోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో త్వరలో మధ్యప్రదేశ్లో జరుగనున్న జాతీయ స్థాయి హాకీ క్రీడాపోటీలకు ఎంపికయ్యాడు.