అమరావతి : ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) పై మంత్రి నాదెండ్ల మనోహర్ (Minister Nadendla) ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటల్లో ఉండే జగన్కు సామాన్య ప్రజల గురించి ఏం తెలుసని అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్ రెండు రోజుల క్రితం ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని కోర్టుకు వెళ్తామని చేసిన ప్రకటనపై నాదెండ్ల స్పందించారు.
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన(President rule) ఎందుకు పెట్టాలో చెప్పాలని డిమాండ్ చేశారు. వృద్ధులకు రూ. 4వేల పింఛన్ ఇస్తున్నందుకా, పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తున్నందుకా అని ప్రశ్నించారు. మాజీ సీఎం ప్రతిపక్ష హోదా , భద్రతాపై కాకుండా ప్రజల గురించి , ప్రజల అవసరాలు ఏంటో తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. వైసీపీ తాడూ, బొంగరం లేని పార్టీ అని విమర్శించారు. వైసీపీకి అధ్యక్షుడు , ప్రధాన కార్యదర్శి ఎవరో తెలియదని పేర్కొన్నారు.