తుంగతుర్తి : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల పెంచిన గ్యాస్ ధరలను ( Gas Prices ) తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం తుంగతుర్తి మండల పరిధిలోని సంగెం గ్రామంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహిళలు గ్యాస్ సిలిండర్లతో నిరసన ( Women protest) చేపట్టారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య( Seetayya ) మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచి సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. నిత్యావసరాల ధరలను అదుపులోకి తెచ్చి పేదలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు జటంగి రవి, మండల నాయకులు మల్యాల రాములు, మాజీఎంపీటీసీ ఇలైజర్, మాజీ సర్పంచ్ జటంగి మల్లమ్మ, మల్లయ్య, శ్రావణ్, సామెల్, విజయ్, వెంకన్న మహిళలు తదితరులు పాల్గొన్నారు.