Priya Prakash Varrier | ఒరు ఆదార్ లవ్ సినిమాలో కన్నుగీటి ఓవర్‌నైట్ స్టార్ స్టేటస్ కొట్టేసింది మలయాళ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్. ఒక్క సినిమాతో ఫాలోవర్లను అమాంతం పెంచేసుకుంది. ఆ తర్వాత తెలుగులో చెక్, ఇష్క్.. నాట్ ఏ లవ్ స్టోరీ, బ్రో సినిమాల్లో మెరిసింది.
సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఈ అమ్మడు ప్రొఫెషనల్ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉంటూనే మరోవైపు సమయం దొరికినప్పుడల్లా తనకిష్టమైన ట్రావెలింగ్ చేస్తూ సరదా సమయాన్ని ఆస్వాదిస్తుంటుంది. తాజాగా ఈ భామ వెకేషన్ ఫొటోలు కొన్ని నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ప్రియా వారియర్ ఎక్కడికెళ్లిందబ్బా అనుకుంటున్నారా..? హాంకాంగ్ సిటీలో షికారు చేసింది. సిటీ రోడ్ల పక్కనున్న పుట్‌ఫాత్‌పై చక్కర్లు కొట్టింది. పార్కులోకి వెళ్లి చల్లని గాలిని ఆస్వాదిస్తూ లోకల్ ట్రైన్లో ప్రయాణించింది.
హిల్ స్టేషన్ ఏరియాకు వెళ్లి అక్కడి అందాలను ఆస్వాదించింది. నైట్ టైంలో హాంకాంగ్ రోడ్లపై షికారు చేసింది. ట్రావెల్ పార్ట్నర్ సఫారీ ట్రావెల్స్తో కలిసి ట్రిప్‌ను సాగిందింది. ఈ ట్రిప్‌కు సంబంధించిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇప్పుడీ ఫొటోలు ట్రావెల్ లవర్స్‌తోపాటు కుర్రకారును కట్టిపడేస్తున్నాయి.
ప్రియా ప్రకాశ్ వారియర్ వెకేషన్ సాగిందిలా..