Anchor Suma | యాంకర్ సుమకు రియల్ ఎస్టేట్ కష్టాలు.?
Anchor Suma | టాలీవుడ్ బుల్లితెరపై టాప్ యాంకర్ ఎవరు అంటే.. సుమ కనకాల అని ఠక్కున చెప్పేస్తారు ఎవరైనా.. ఆమె మాటలో చమత్కారం, స్పాంటేనియస్ అందర్ని ఆకట్టుకుంటాయి. ఎలాంటి ఫంక్షన్‌నైనా తన ప్రతిభతో రక్తికట్టిస్తుంది.
Anchor Suma | టాలీవుడ్ బుల్లితెరపై టాప్ యాంకర్ ఎవరు అంటే.. సుమ కనకాల అని ఠక్కున చెప్పేస్తారు ఎవరైనా.. ఆమె మాటలో చమత్కారం, స్పాంటేనియస్ అందర్ని ఆకట్టుకుంటాయి. ఎలాంటి ఫంక్షన్‌నైనా తన ప్రతిభతో రక్తికట్టిస్తుంది. కేవలం సుమ కనకాల యాంకరింగ్ కోసమే.. ఆమె డేట్ కుదరటం కోసమే ప్రిరీలీజ్ ఫంక్షన్లు కూడా వాయిదా వేస్తారంటే ఎటువంటి అతిశయోక్తి లేదు. అందుకే సుమకు వున్న పాపులారిటీని బేస్ చేసుకుని పలు వాణిజ్య ప్రకటనల్లో నటించే అవకాశాలు కూడా ఆమెను వరించాయి. ఇప్పటికే ఆమె ఎన్నో యాడ్స్‌లో నటించారు. అయితే తాజాగా ఆమె నటించిన ఓ వాణిజ్య ప్రకటనే ఆమెను చిక్కుల్లో పడేసింది.
ఇటీవల ఆమె నటించిన ఓ రియల్ఎస్టేట్ యాడ్ చూసి అందులో పెట్టుబడులు పెట్టి నష్టపోయామని బాధితులు ఆందోళన చేపట్టారు. ఆమెను యాడ్‌లో చూస్తే ఆ సంస్థలో ఫ్లాట్స్ కొన్నామని సదరు బాధితులు ఆరోపిస్తున్నారు. అంతే కాదు సదరు రియల్ఎస్టేట్ సంస్థ బోర్డ్ తిప్పేయడంతో బాధితులు సుమకు లీగల్ నోటిసులు పంపారు. ఈ వివాదంపై సుమ కనకాల తన ఇన్‌స్టా ఖాతాలో ఓ పోస్టు పెట్టారు.
నేను 2016 నుండి 2018 వరకే అగ్రిమెంట్ చేసుకున్న యాడ్‌ను ఇప్పుడు వైరల్ చేసి నాకు నష్టం కలిగిస్తున్నారు. గడువు పూర్తయిన తరువాత కూడా నా పర్మిషన్ లేకుండా నా యాడ్‌ను సోషల్‌మీడియాలో పెడుతున్నారు. అందుకే ఆ సంస్థకు లీగల్ నోటిసులు కూడా పంపాను. అంతేకాదు ప్రజలు కూడా అధికారిక న్యూస్ ఛానెల్స్‌లో ప్రసారమయ్యే యాడ్స్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. ఎప్పుడూ నాకు ప్రేమను పంచే అందరికి థ్యాంక్స్ అంటూ తన ఇన్‌స్టా ఖాతాలో రాసుకొచ్చారు. ఏపీలోని రాజమండ్రికి చెందిన రాకీ అవెన్యూస్ అనే రియల్ ఎస్టేట్ సంస్థలో తమ కలలను సాకారం చేసుకోవడానికి సొంత ఇంటికోసం ప్రజలు దాదాపుగా 88 కోట్లు చెల్లించారు. కానీ సంస్థ బోర్డు తిప్పేసింది. ఈ సంస్థ వాణిజ్య ప్రకటనలో సుమ నటించారు. అంతేకాదు సుమ భర్త రాజీవ్ కనకాల కూడా ఈ సంస్థకు అధికారిక ప్రచారకర్త (బ్రాండ్ అంబాసిడర్) గా వ్యవహరించారట.
Also Read..
- Watch: ఐదో అంతస్తు నుంచి పడిన కుక్క.. నడుస్తున్న బాలికపై పడటంతో ఆ చిన్నారి మృతి
- Crocodile | గ్రామ వీధుల్లో మొసలి హల్చల్.. వైరల్ వీడియో
- Heart attack | విషాదం మిగిల్చిన వినోదం.. డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన టీచర్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

