Heart attack | విషాదం మిగిల్చిన వినోదం.. డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన టీచర్..!
Heart attack | భజన కళాకారులు పాటలు పాడుతుంటే కుటుంబసభ్యులు ఆనందంతో నృత్యాలు చేస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు కాసేపు విశ్రాంతి తీసుకుంటూ కాసేపు నృత్యం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు నృత్యం చేస్తూ గుండెపోటుతో కుప్పకూలాడు.
Heart attack : ప్రభుత్వ ఉపాధ్యాయుడి పదవీ విరమణ నేపథ్యంలో ఆయన కుటుంబానికి చెందిన సభ్యులంతా కలిసి ఆలయంలో వేడుక జరుపుకున్నారు. ఈ వేడుకలో భాగంగా భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భజన కళాకారులు పాటలు పాడుతుంటే కుటుంబసభ్యులు ఆనందంతో నృత్యాలు చేస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు కాసేపు విశ్రాంతి తీసుకుంటూ కాసేపు నృత్యం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు నృత్యం చేస్తూ గుండెపోటుతో కుప్పకూలాడు.
వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లా కిష్ణగఢ్-రెన్వాల్ ఏరియాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మంగల్ జఖర్ ఇటీవల పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులు స్థానిక ఆలయంలో వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకలకు తమ దగ్గరి బంధువులను ఆహ్వానించారు. మంగల్ జఖర్ సొంత తమ్ముడు మన్నారామ్ జఖర్ కుటుంబం కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నది. మన్నారామ్ జఖర్ కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడే. జోధ్‌పూర్‌లోని జూడ్ గ్రామంలో ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అన్న రిటైర్మెంట్ వేడుకల్లో పాల్గొనేందుకు కిష్ణగఢ్కు వచ్చారు.
ఈ క్రమంలో ఆదివారం రాత్రి వేడుకలు మొదలుకాగానే మన్నారామ్ జఖర్ నృత్యం చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఇతర కుటుంబసభ్యులు డ్యాన్స్ చేస్తుంటే కూర్చుని చూశారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో మరో పాటకు డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత రెండు నిమిషాలకే ఆయన గుండెపోటుతో కుప్పకూలారు. కుటుంబసభ్యులు 10 నిమిషాలపాటు సీపీఆర్ చేసినా కదలిక లేకపోవడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే మన్నారామ్ అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
డాన్స్ చేస్తూ కుప్పకూలిన టీచర్.. గుండెపోటుతో మృతి
రాజస్థాన్ – జోధ్‌పూర్‌లో జఖార్ అనే ఈ టీచర్ ఇంట్లో ఫంక్షన్లో డాన్స్ వేస్తూ కుప్పకూలిపోయాడు.
వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే గుండెపోటుతో మరణించాడని డాక్టర్లు తెలిపారు. pic.twitter.com/lGV66UQzqy
— Telugu Scribe (@TeluguScribe) August 5, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mammootty | ఏడేళ్ల తర్వాత తమిళంలో నటిస్తున్నా.. ‘ఓం’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మమ్ముట్టి!
Mohammed Shami: టెస్టు క్రికెట్‌కు అల్విదా ప్రకటించిన బౌలర్ షమీ.. వీడియో
Doodimetla Balaraj Yadav | కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ.. దూదిమెట్లకు బెయిల్ మంజూరు
Salman Khan | ప్రభుత్వ ఒత్తిడితో కథ మార్చలేదు.. ‘మాతృభూమి’ వివాదాలపై సల్మాన్ ఖాన్ ఫుల్ క్లారిటీ!
RC 17 | ఆర్సీ17లో రామ్ చరణ్ సరసన ఆ ఇద్దరిలో ఒకరు .. హీరోయిన్ విషయంలో సుకుమార్ కీలక నిర్ణయం!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

