Watch: ఐదో అంతస్తు నుంచి పడిన కుక్క.. నడుస్తున్న బాలికపై పడటంతో ఆ చిన్నారి మృతి
Dog Falls From 5th Floor Killing Girl | పెంపుడు కుక్క బిల్డింగ్ ఐదో అంతస్తు నుంచి కింద పడింది. అయితే కింద ఉన్న రోడ్డ్పై తల్లితో కలిసి నడుస్తున్న మూడేళ్ల బాలికపై ఆ కుక్క పడింది. స్పృహ తప్పిన ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించగా మరణించినట్లు డాక్టర్లు చెప్పారు. దీంతో ఆ బాలిక కుటుంబంలో విషాదం నెలకొన్నది.
ముంబై: పెంపుడు కుక్క బిల్డింగ్ ఐదో అంతస్తు నుంచి కింద పడింది. అయితే కింద ఉన్న రోడ్డ్పై తల్లితో కలిసి నడుస్తున్న మూడేళ్ల బాలికపై ఆ కుక్క పడింది. స్పృహ తప్పిన ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించగా మరణించినట్లు డాక్టర్లు చెప్పారు. (Dog Falls From 5th Floor Killing Girl) దీంతో ఆ బాలిక కుటుంబంలో విషాదం నెలకొన్నది. మహారాష్ట్రలోని థానేలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం మధ్యాహ్నం ముంబ్రాలోని అమృత్‌నగర్‌లో చిరాగ్ మాన్షన్ 5వ అంతస్తు పైనుంచి పెంపుడు కుక్క కింద పడింది. బంధువులు, తల్లితో కలిసి రోడ్డుపై నడిచి వెళ్తున్న మూడేళ్ల బాలికపై ఆ కుక్క పడింది. ఆ ధాటికి రోడ్డుపై పడిన ఆ చిన్నారి స్పృహ కోల్పోయింది.
కాగా, ఆందోళన చెందిన తల్లి ఆ బాలికను ఎత్తుకుని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లింది. వైద్య పరీక్షల కోసం మరో ఆసుపత్రికి తరలించగా ఆ చిన్నారి మరణించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ కుక్క ప్రమాదవశాత్తు బిల్డింగ్‌పై నుంచి పడిందా? జంప్ చేసిందా? లేక ఆ కుక్కను ఎవరైనా కిందకు తోసేశారా? అన్నది ఆరా తీస్తున్నారు.
మరోవైపు బిల్డింగ్ పైనుంచి బాలికపై పడి ఆ చిన్నారి మరణానికి కారణమైన పెంపుడు కుక్క తీవ్రంగా గాయపడింది. అనంతరం పైకి లేచిన అది బాధతో కుంటుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
MUMBRA | A tragic incident occurred in Mumbra, where a dog fell on a three-year-old child, resulting in her death. The child was walking with her mother when the dog, which was on the fifth floor of a building, jumped off and landed on the child. The incident took place in the… pic.twitter.com/lBQHjLnXDz
— ℝ𝕒𝕛 𝕄𝕒𝕛𝕚 (@Rajmajiofficial) August 7, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

