Sakshi Vaidya | ఏజెంట్, గాండీవధారి అర్జున సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పింది సాక్షి వైద్య. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశనే మిగిల్చాయి. సాక్షి వైద్య ఇక ఎలాగైనా హిట్టు కొట్టాలని ఈ సారి శర్వానంద్‌తో కలిసి నారి నారి నడుమ మురారి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ జనవరి 14న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకుంది సాక్షి వైద్య.
ఈ భామ ముందుగా పవన్ కల్యాణ్ టైటిల్ రోల్లో పోషిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్‌లో అవకాశం కొట్టేసిన విషయం తెలిసిందే. అయితే అనుకోకుండా ఈ ఛాన్స్ రాశీఖన్నా చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇదే విషయంపై సాక్షి వైద్య మాట్లాడుతూ.. ఉస్తాద్ భగత్ సింగ్ కోసం వారంపాటు షూటింగ్లో కూడా పాల్గొన్నా. కానీ ముందుగా తీసుకున్న కమిట్మెంట్స్, డేట్ల సర్దుబాటు కారణంగా అనుకోకుండా పవన్ కల్యాణ్‌తో కలిసి నటించే అవకాశం మిస్సయానంటూ చెప్పుకొచ్చింది సాక్షి వైద్య. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఒకవేళ ఉస్తాద్ భగత్ సింగ్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోకుండా ఉంటే ఈ మూవీ సాక్షి వైద్య కెరీర్‌కు ప్లస్ అయి ఉండేదనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి రానున్న రోజుల్లో సాక్షి వైద్య, పవన్ కల్యాణ్ కాంబో రిపీట్ అవుతుందేమో చూడాలి.
NBK 111 | బాలయ్య సినిమా నుండి స్టార్ హీరోయిన్ ఔట్.. అదే కారణమా?