Vijay Hazare Trophy : ఇటీవల ఫామ్ లేమితో బాధపడుతున్న శుభ్‌మన్ గిల్ (Shubman Gill) మళ్లీ నిరాశపరిచాడు. న్యూజిలాండ్ సిరీస్‌కు ముందు టచ్‌లోకి రావాలని దేశవాళీ క్రికెట్ ఆడుతున్న గిల్.. అక్కడా స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగాడు. వన్డే ఫార్మాట్లో జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy )లో భారత కెప్టెన్ 11 పరుగులకే ఔటయ్యాడు. గోవా బౌలర్ల వ్యూహాలకు గిల్ చేతులెత్తేయగా.. పునరాగమనంలో అదరగొడుతూ ముంబైకి సారథి శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer) అర్ధ శతకంతో రాణించాడు.
నిరుడు టెస్టులు, వన్డే, టీ20ల్లో శతకాలతో హోరెత్తించిన శుభ్‌మన్ గిల్ ఇప్పుడు ఫామ్ కోసం తంటాలు పడుతున్నాడు. మెడ గాయం నుంచి కోలుకొని దక్షిణాఫ్రికాతో టీ20లు ఆడిన అతడు పెద్ద స్కోర్ చేయలేకపోయాడు. దాంతో.. స్వదేశంలో ఫిబ్రవరిలో జరుగబోయే పొట్టి ప్రపంచకప్ స్క్వాడ్‌లోకి అతడని సెలెక్టర్లు తీసుకోలేదు. దాంతో.. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లోపు ఎలాగైనా లయ అందుకోవాలనుకున్న గిల్ విజయ్ హజారే ట్రోఫీలోనూ ఉసూరుమనిపించాడు.
Shubman Gill dismissed for 11 (12) in the 211-run chase against Goa in the Vijay Hazare Trophy, caught at first slip. pic.twitter.com/Zgi8vwG6zj
— Sonu (@Cricket_live247) January 6, 2026
గోవా నిర్దేశించిన 211 పరుగుల ఛేదనలో చెలరేగిపోతాడనుకుంటే.. ఫస్ట్ స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి 11 పరుగులకే పెవిలియన్ చేరాడు. దాంతో.. ‘ఏం గిల్. ఫ్లాట్ పిచ్‌లంటే భయమా?’ అంటూ నెటిజన్లు భారత సారథిని తెగ విమర్శిస్తున్నారు. అయితే.. ప్లీహం గాయం నుంచి కోలుకున్న శ్రేయాస్ అయ్యర్ పునరాగమనం మ్యాచ్‌లో అర్ధ శతకం బాదేశాడు. విజయ్ హాజరే ట్రోఫీలో మంగళవారం హిమాచల్ ప్రదేశ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న అయ్యర్.. 82 పరుగులతో సత్తా చాటాడు. జనవరి 11 నుంచి సొంతగడ్డపై కివీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో గిల్‌కు డిప్యూటీగా ఆడనున్నాడీ ముంబై స్టార్.
𝘼𝙖𝙩𝙚 𝙝𝙞 𝙠𝙖𝙖𝙢 𝙨𝙝𝙪𝙧𝙪 𝙠𝙖𝙧 𝙙𝙞𝙮𝙚 🫡🔥#ShreyasIyer makes a roaring comeback from injury, turning out for Mumbai in the Vijay Hazare Trophy! 💪🏏
Watch the Vijay Hazare Trophy on Star Sports Khel & JioHotstar pic.twitter.com/Gc1Ee2GEQ9
— Star Sports (@StarSportsIndia) January 6, 2026