Afghanistan | శ్రీలంకతో ఏకైక టెస్టుకు రషీద్ దూరం.. ఆ నలుగురికి లక్కీ చాన్స్
Afghanistan : శ్రీలంకతో ఏకైక టెస్టు కోసం అఫ్గనిస్థాన్ క్రికెట్ బోర్డు(Afghanistan Cricket Board) స్క్వాడ్‌ను ప్రకటించింది. వరల్డ్ కప్‌లో కెప్టెన్‌గా నిరూపించుకున్న హష్మతుల్లా షాహిదీ(Hashmatullah Shahidi) సారథ్యంలో 16 మంది సభ్యులతో కూడిన...
Afghanistan : శ్రీలంకతో ఏకైక టెస్టు కోసం అఫ్గనిస్థాన్ క్రికెట్ బోర్డు(Afghanistan Cricket Board) స్క్వాడ్‌ను ప్రకటించింది. వరల్డ్ కప్‌లో కెప్టెన్‌గా నిరూపించుకున్న హష్మతుల్లా షాహిదీ(Hashmatullah Shahidi) సారథ్యంలో 16 మంది సభ్యులతో కూడిన బృందాన్ని ఎంపిక చేసింది. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్(Rashid Khan) ఇంకా కోలుకోకపోవడంతో అతడి స్థానం లెగ్ స్పిన్నర్ ఖైస్ అహ్మద్(Qais Ahmad) చోటు దక్కించుకున్నాడు.
ఈ టెస్టు కోసం ఏకంగా నలుగురు కొత్త కుర్రాళ్లను అఫ్గనిస్థాన్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. నూర్ అలీ జద్రాన్, జియా ఉర్ రెహ్మాన్, మహమ్మద్ ఇషాక్, నవీద్ జద్రాన్‌లు సిరీస్‌తో టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నారు. ఇరుజట్ల మధ్య కొలంబోలో ఫిబ్రవరి 2న ఏకైక టెస్టు మ్యాచ్ జరుగనుంది. అనంతరం మూడు మ్యాచ్‌ల వన్డే, టీ20 సిరీస్‌లో లంక, అఫ్గనిస్థాన్ తలపడనున్నాయి.
🚨 SQUAD ALERT 🚨
AfghanAtalan’s Lineup Revealed for the One-Off Test Match against @OfficialSLC, starting this Friday in Colombo! 👇
More 👉: https://t.co/cIxe33OBf5 #AfghanAtalan | #SLvAFG2024 pic.twitter.com/Q7IpR2U2qM
— Afghanistan Cricket Board (@ACBofficials) January 29, 2024
అఫ్గనిస్థాన్ టెస్టు స్క్వాడ్ : హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), ఇబ్రహీం జర్డాన్, అబ్దుల్ మాలిక్, నూర్ అలీ జద్రాన్, రహ్మత్ షా(వైస్ కెప్టెన్), బషీర్ షా, నసీర్ జమాల్, ఇక్రమ్ అలిఖిల్, మహ్మద్ ఇషాక్, ఖాసీ అహ్మద్, జియా ఉర్ రెహ్మాన్, జహీర్ ఖాన్, యమిన్ అహ్మద్జాయ్, నిజత్ మసూద్, మహ్మద్ సలీం, నవీద్ జద్రాన్.
అఫ్గనిస్థాన్ జట్టు నిరుడు జనవరిలో చివరి టెస్టు మ్యాచ్ ఆడింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 546 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైది. ఆ తర్వాత జరిగిన ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్‌లో అఫ్గన్ జట్టు అద్భుతంగా ఆడింది. ప్రపంచ కప్‌లో ఏకంగా మాజీ చాంపియన్లు శ్రీలంక, పాకిస్థాన్, ఇంగ్లండ్‌కు షాకిచ్చింది.
ఇవి కూడా చదవండి
- Imran Khan | సైఫర్ కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు పదేళ్లు జైలు శిక్ష
- Deep Grace Ekka | ఒలింపిక్స్ ముందు భారత్‌కు షాక్.. వీడ్కోలు పలికిన స్టార్ ప్లేయర్
- Chess Player Divya Deshmukh: ప్రేక్షకులు వేధించారు.. చెస్ ప్లేయర్ దివ్య ఆరోపణ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

