Deep Grace Ekka | ఒలింపిక్స్ ముందు భారత్‌కు షాక్.. వీడ్కోలు పలికిన స్టార్ ప్లేయర్
Deep Grace Ekka : ప్యారిస్ ఒలింపిక్స్ ముందు భారత హాకీ క్రీడాకారిణి దీప్ గ్రేస్ ఎక్కా(Deep Grace Ekka) సంచనల నిర్ణయంతో అందర్నీ షాక్‌కు గురి చేసింది. పెనాల్టీ కార్నర్ ఎక్స్‌పర్ట్‌గా పేరొందిన ఆమె పదేండ్ల సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు...
Deep Grace Ekka : ప్యారిస్ ఒలింపిక్స్ ముందు భారత హాకీ క్రీడాకారిణి దీప్ గ్రేస్ ఎక్కా(Deep Grace Ekka) సంచనల నిర్ణయంతో అందర్నీ షాక్‌కు గురి చేసింది. పెనాల్టీ కార్నర్ ఎక్స్‌పర్ట్‌గా పేరొందిన ఆమె పదేండ్ల సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికింది. దేశం తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆమె శనివారం సోషల్‌మీడియా పోస్ట్ ద్వారా రిటైర్మెంట్ ప్రకటించింది. ఎఫ్ఐహెచ్ ఒలింపిక్ క్వాలిఫయర్స్(FIH Olympic Qualifier) జట్టులో చోటు దక్కకపోవడంతోనే ఎక్కా ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
‘2011 నుంచి 2023 కాలం నా జీవితంలో చాలా గొప్పది. భారత దేశానికి ప్రాతినిధ్యం వహించిందనుకు గర్వంగా భావిస్తున్నా. ఇన్ని రోజులు నాకు సహకరించిన కోచ్, మెంటార్, సహాయక సిబ్బంది, జట్టు సభ్యులకు ధన్యవాదాలు. నా కలల్ని నిజం చేసుకోవడంలో మీ అందరు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చారు’ అని ఎక్కా తన పోస్ట్‌లో తెలిపింది.
హాకీ కర్మాగారమైన ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లాలోని లల్కిడిహి(Lalkidihi) గ్రామంలో పుట్టింది. అందురు అమ్మాయిల్లా చదువు, ఇల్లుకే పరిమితం కాకుండా ఆటలపై ఆసక్తి పెంచుకుంది. అయితే.. హాకీని ఎంచుకున్న తొలినాళ్లలో అందరూ ఆమెను చూసి ఆడపిల్ల ఏంటీ? హకీ ఆడడం ఏంటీ? అని విమర్శించేవాళ్లు. కానీ, వాళ్ల మాటలకు తన ఆటతోనే ఎక్కా బదులిచ్చింది.
Hockey: Deep Grace Ekka calls time on 12-year-long career https://t.co/zSvbsu4f0O
— Scroll.in (@scroll_in) January 27, 2024
జూనియర్ స్థాయిలో అద్భుతంగా రాణించి 2011లో సీనియర్ జట్టుకు ఎంపికైంది. ఎక్కా తన కెరీర్లో అత్యధికంగా 264 మ్యాచ్‌లు ఆడింది. అయితే 24 గోల్స్ మాత్రమే కొట్టింది. టోక్యో ఒలిపింక్స్‌లో సెమీ ఫైనల్ ఆడిన భారత జట్టులో ఎక్కా సభ్యురాలు.
ఇవి కూడా చదవండి
- Healthy Drinks | ఈ పానీయాలతో రోజంతా ఉత్తేజం
- Paris Olympics | ఒలిపింక్స్ పతకంపై గురి.. శిక్షణ కోసం విదేశాలకు భారత అథ్లెట్లు
- RJD MP Manoj Jha | విపక్ష పార్టీలంటే బీజేపీకి భయం.. అందుకే కేంద్ర సంస్థల దర్యాప్తు.. ఆర్జేడీ ఎంపీ ఫైర్..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab | డ్రగ్స్ వ్యతిరేక కార్యకర్త హత్య కేసు.. నిందితుడి ఇల్లు కూల్చివేత.. షాపు దహనం
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
Kuravi | వీరన్న సన్నిధిలో బీఆర్ఎస్ మహిళా నేతల పూజలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్‌రావు డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

