ఇండోర్: లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి (Congress) వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మధ్యప్రదేశ్లోని ఇండోర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అక్షయ్ కాంతి బాబ్ (Akshay Kanti Bamb) తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. ఆయనను పార్టీలోకి ఆహ్వానిస్తూ మంత్రి విజయ్వర్గియ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ఇండోర్ అభ్యర్థి అక్షయ్ కాంతిని బీజేపీలోకి సాదరంగా స్వాగతం పలుకుతున్నట్లు పేర్కొన్నారు. అక్షయ్ తనతో ఉన్న ఫొటోను దానికి ట్యాగ్ చేశారు. దీంతో ఇండోర్ మరో సూరత్ కానుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గుజరాత్లోని సూరత్ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురవడం, మిగిలిన వారు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే.
గుజరాత్లోని సూరత్ స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. కాంగ్రెస్ అభ్యర్థి నీలేశ్ కుంభానీ నామినేషన్ పత్రాలపై ప్రతిపాదకులుగా సంతకాలు చేసిన ముగ్గురు అవి తమవి కాదని చెప్పడంతో.. అది తిరస్కరణకు గురైంది. కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థి నామినేషనూ చెల్లలేదు. ఆ వెంటనే ఇండిపెండెంట్లు కూడా బరి నుంచి వైదొలగడంతో ముకేశ్ దలాల్ విజేత అయ్యారు.
इंदौर से कांग्रेस के लोकसभा प्रत्याशी श्री अक्षय कांति बम जी का माननीय प्रधानमंत्री श्री @narendramodi जी, राष्ट्रीय अध्यक्ष श्री @JPNadda जी, मुख्यमंत्री @DrMohanYadav51 जी व प्रदेश अध्यक्ष श्री @vdsharmabjp जी के नेतृत्व में भाजपा में स्वागत है। pic.twitter.com/1isbdLXphb
— Kailash Vijayvargiya (Modi Ka Parivar) (@KailashOnline) April 29, 2024