Imran Khan | పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు పదేళ్లు జైలు శిక్ష
Imran Khan | మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)కు భారీ షాక్ తగిలింది. అధికారిక రహస్యాలను బయటపెట్టిన కేసులో (Cipher case) పాకిస్థాన్ కోర్టు ఇమ్రాన్‌కు పదేళ్ల జైలు శిక్ష విధించింది.
Imran Khan | మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)కు భారీ షాక్ తగిలింది. అధికారిక రహస్యాలను బయటపెట్టిన కేసులో (Cipher case) పాకిస్థాన్ కోర్టు ఇమ్రాన్‌కు పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఇమ్రాన్‌తోపాటు మాజీ విదేశాంగ మంత్రి, పీటీఐ వైస్ చైర్మన్ షా మహమూద్ ఖురేషీ (Shah Mahmood Qureshi)కి కూడా 10 ఏళ్లు శిక్ష విధిస్తూ స్పెషల్ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది.
2022లో ప్రధాన మంత్రి పదవి నుంచి దిగిపోయే ముందు ఇమ్రాన్ ఖాన్ బహిరంగ ర్యాలీలో మాట్లాడారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు అగ్రరాజ్యం అమెరికా కుట్రపన్నిందని ఆరోపించారు. అమెరికా ఆదేశాలకు అనుగుణంగా పాకిస్థాన్ మిలిటరీ ప్రభుత్వం నడుచుకుంటోందని ఆరోపణలు గుప్పించారు. ఇందుకు ఆధారాలుగా కొన్ని పత్రాలను ఆ ర్యాలీలో ప్రదర్శించారు. అమెరికాలోని పాకిస్థాన్ ఎంబసీ నుంచి వాటిని సేకరించినట్లు తెలిపారు.
దీంతో అధికారిక దౌత్య సమాచారానికి సంబంధించిన వివరాలను బహిర్గతం చేయడం ద్వారా దేశ రహస్య చట్టాలను ఉల్లంఘించారని ఇమ్రాన్ ఖాన్, ఖురేషీలపై పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన స్పెషల్ కోర్టు.. ఇద్దరినీ దోషులుగా తేల్చింది. ఈ మేరకు ఇరువురికీ పదేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
Also Read..
Hemant Soren | సోరెన్ మిస్సింగ్.. ఆచూకీ చెప్తే నగదు రివార్డు.. ప్రకటించిన బీజేపీ నేత
Maldives Tourism | మాల్దీవుల పర్యాటకుల్లో గణనీయంగా పడిపోయిన భారత్ వాటా.. ఎన్నో స్థానానికంటే..?
Mahatma Gandhi | న్యూయార్క్‌లో మహాత్మా గాంధీ నూతన విగ్రహం ఆవిష్కరణ
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

