Hemant Soren | సోరెన్ మిస్సింగ్.. ఆచూకీ చెప్తే నగదు రివార్డు.. ప్రకటించిన బీజేపీ నేత
Hemant Soren | మనీలాండరింగ్ (money laundering case) ఆరోపణలను ఎదుర్కొంటున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి (Jharkhand Chief Minister ) హేమంత్ సోరెన్ (Hemant Soren) గత మూడు రోజుల నుంచి కనిపించకుండా పోవడం తీవ్ర కలకలం రేపుతోంది.
Hemant Soren | మనీలాండరింగ్ (money laundering case) ఆరోపణలను ఎదుర్కొంటున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి (Jharkhand Chief Minister ) హేమంత్ సోరెన్ (Hemant Soren) గత మూడు రోజుల నుంచి కనిపించకుండా పోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బాబూలాల్ మరాండీ (Babulal Marandi) మంగళవారం కీలక ప్రకటన చేశారు. సీఎంను కనిపెట్టి సమాచారం ఇచ్చిన వారికి నగదు రివార్డు (cash reward) ప్రకటించారు. రూ.11,000 బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోరెన్ ‘మిస్సింగ్’ అంటూ పోస్టర్‌ను ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా షేర్ చేశారు.
ప్రభుత్వ భూముల యాజమాన్యం మార్పు కుంభకోణంలో రూ.600 కోట్లు చేతులు మారినట్లు ఈడీ ఆరోపిస్తున్నది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని సొరేన్‌కు ఈడీ (Enforcement Directorate) అధికారులు ఏడు సార్లు సమన్లు జారీ చేశారు. అయితే ఆయన ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు. ఈ నెల 27న కూడా ఈడీ.. సోరెన్‌కు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. జనవరి 29న గానీ, 31న గానీ అందుబాటులో ఉండాలని కోరుతూ స్పందన తెలియజేయాలని పేర్కొంది. అయితే, ఆయన 27వ తేదీన రాత్రి నుంచే అందుబాటులో లేకుండా పోయారు. ఇప్పటి వరకూ సోరెన్ ఆచూకీ తెలియరాలేదు. అతన్ని సంప్రదించేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా అందుబాటులోకి రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆయన ఫోన్ కూడా స్విచ్ఛాప్‌లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే, సీఎం సోరెన్ పరారయ్యాడంటూ బీజేపీ ఆరోపిస్తోంది.
तलाश है झारखंड के गुमशुदा मुख्यमंत्री की…
जिन किसी भी सज्जन को यह व्यक्ति दिखें तो, दिए गए पते पर तुरंत सूचित करें।
सही जनकारी देने वाले को 11 हजार रुपये नगद राशि दी जाएगी। pic.twitter.com/9nvFhVQlnl
— Babulal Marandi (@yourBabulal) January 30, 2024
Also Read..
Hemant Soren | సోరెన్ ఇంట్లో రూ.36 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న ఈడీ అధికారులు
Hemant Soren-JMM | సంక్షోభంలో సోరెన్ సర్కార్.. రేపు ‘సోరెన్’ ఈడీ విచారణ.. ఎమ్మెల్యేలకు హుకూం..!
Maldives Tourism | మాల్దీవుల పర్యాటకుల్లో గణనీయంగా పడిపోయిన భారత్ వాటా.. ఎన్నో స్థానానికంటే..?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

