Maldives Tourism | మాల్దీవుల పర్యాటకుల్లో గణనీయంగా పడిపోయిన భారత్ వాటా.. ఎన్నో స్థానానికంటే..?
Maldives Tourism | భారత్ - మాల్దీవుల మధ్య నెలకొన్న దౌత్య పరమైన వివాదం తర్వాత మాల్దీవుల పర్యాటకం (Maldives Tourism)లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి.
Maldives Tourism | భారత్ – మాల్దీవుల మధ్య నెలకొన్న దౌత్య పరమైన వివాదం తర్వాత మాల్దీవుల పర్యాటకం (Maldives Tourism)లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా రెండు దేశాల మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో మాల్దీవులకు క్యూకట్టే భారతీయుల (Indians) సంఖ్య వారాల వ్యవధిలోనే దారుణంగా పడిపోయింది. దీంతో గతంలో మాల్దీవుల విదేశీ పర్యాటకంలో మొదటి స్థానంలో ఉండే భారత్ ఇప్పుడు ఏకంగా ఐదో స్థానానికి పడిపోవడం గమనార్హం.
మాల్దీవుల పర్యాటక శాఖ విడుదల చేసిన తాజా డేటా ప్రకారం (Maldives Tourism Rankings).. గతేడాది డిసెంబర్ 31 నాటికి 2,09,198 మంది పర్యాటకులతో భారత్ అగ్రస్థానంలో ఉండేది. ఆ ఏడాది మాల్దీవుల్లో భారత్ పర్యాటకుల వాటా దాదాపు 11 శాతం. ఇప్పుడు ఏకంగా ఐదో స్థానానికి పడిపోయింది. 2024 జనవరి 28 నాటికి మాల్దీవులు టూరిజంలో భారత్ వాటా ఏకంగా 8 శాతానికి పతనమైంది. ఈ ఏడు కేవలం 13,989 మంది భారతీయులు మాత్రమే మాల్దీవులను సందర్శించారు. ఈ ఏడాది జనవరి మాసంలో అత్యధిక మంది పర్యాటకులను మాల్దీవులకు పంపిన దేశాల్లో 18,561 మంది పర్యాటకులతో రష్యా తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఇటలీ (18,111), చైనా (16,529) , యూకే (14,588) దేశాలు రష్యా తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
మాల్దీవుల ప్రభుత్వ లెక్కల ప్రకారం..
- రష్యా : 18,561 మంది పర్యాటకులు (10.6% మార్కెట్ వాటా, 2023లో 2వ ర్యాంక్)
- ఇటలీ : 18,111 మంది (10.4% మార్కెట్ వాటా, 2023లో 6వ ర్యాంకు )
- చైనా : 16,529 మంది (9.5% మార్కెట్ వాటా, 2023లో 3వ ర్యాంకు )
- యూకే : 14,588 మంది (8.4% మార్కెట్ వాటా, 2023లో 4వ ర్యాంకు)
- భారత్ : 13,989 మంది (8.0% మార్కెట్ వాటా, 2023లో 1వ ర్యాంకు )
- జర్మనీ : 10,652 మంది (6.1% మార్కెట్ వాటా)
- యూఎస్ఏ : 6,299 మంది (3.6% మార్కెట్ వాటా, 2023లో 7వ ర్యాంకు )
- ఫ్రాన్స్ : 6,168 మంది (3.5% మార్కెట్ వాటా, 2023లో 8వ ర్యాంకు)
- పోలాండ్ : 5,109 మంది (2.9% మార్కెట్ వాటా, 2023లో 14వ ర్యాంకు)
- స్విట్జర్లాండ్ : 3,330 మంది (1.9% మార్కెట్ వాటా, 2023లో 10వ ర్యాంకు)
Also Read..
Mahatma Gandhi | న్యూయార్క్లో మహాత్మా గాంధీ నూతన విగ్రహం ఆవిష్కరణ
Indian student | అమెరికాలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి మృతి
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

