Singapore Open : ప్రతిష్ఠాత్మక సింగపూర్ ఓపెనర్ సూపర్ 750లో గురువారం భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి ద్వయం క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే.. బ్యాడ్మింటన్ స్టార్లు పీవీ సింధు (PV Sindhu), హెచ్ఎస్ ప్రణయ్(HS Prannoy)లకు మాత్రం చుక్కెదురైంది. రెండో రౌండ్లో సత్తా చాటలేక టోర్నీ నుంచి నిష్క్రమించారు.
డబుల్స్‌లో చెలరేగి ఆడుతున్న సాత్విక్ – చిరాగ్ జంట ఏడోసీడ్ ద్వయాన్ని మట్టికరిపించింది. ఇండోనేషియా షట్లర్లు సబర్ కర్యమన్ గుటమ, మొహ్ రెజా పహ్లెవీ జోడీని చిత్తు చేసింది. గంట 14 నిమిషాల పాటు సాగిన సుదీర్ఘ పోరులో తొలి సెట్‌ను 19-21తో కోల్పోయినప్పటికీ.. అద్భుతంగా పుంజుకున్న భారత జంట 21-16, 21-19తో గెలుపొంది క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. సెమీస్ బెర్తు కోసం మలేషియా ద్వయాన్ని సాత్విక్ – చిరాగ్ ఢీ కొననున్నారు.
🔥 Quarterfinals, here we come! 🇮🇳
Satwik/Chirag dig deep to take down World No. 8 Gutama/Isfahani in a thrilling R16 comeback: 19-21, 21-16, 21-19 💪
Big fight, big heart — on to the Last Eight at the Singapore Open 2025! 🏸#SingaporeOpen2025 #Badminton #BWFWorldTour… pic.twitter.com/0hPk7B4OI5
— BAI Media (@BAI_Media) May 29, 2025
ఈ సీజన్లో నిరాశపరుస్తున్న సింధు.. మరోసారి క్వార్టర్స్‌కు ముందే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈమధ్యే మలేషియా మాస్టర్స్‌లో తొలి రౌండ్లోనే వెనుదిరిగిన భారత షట్లర్.. సింగపూర్ ఓపెన్‌లోనూ ఇంటిదారి పట్టింది. వరల్డ్ నంబర్ 5 చెన్ యుఫే చేతిలో ఓడిపోయింది. తొలి సెట్‌ను 9-21తో కోల్పోయిన సింధు.. రెండో సెట్‌ను సొంతం చేసుకున్నప్పటికీ నిర్ణయాత్మక మూడో సెట్లో తేలిపోయింది.
సింధు, ప్రణయ్
ఇక పతకంపై ఆశలు రేపిన ప్రణయ్ సైతం స్థాయికి తగ్గట్టు ఆడలేదు. హోరాహోరీ పోరులో క్రిస్టో పపోవ్ ధాటికి రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. వరుస సెట్లలో విఫలమైన ప్రణయ్ 16-21, 14-21తో పరాజయం పాలయ్యాడు. మహిళల డబుల్స్‌లో త్రీసా జాలీ, గాయత్రి గోపిచంద్ ద్వయం కూడా నిష్క్రమించింది. మిక్స్డ్ డబుల్స్‌లోనూ రోహన్ కపూర్, రుత్వికా శివానిలు హాంకాంగ్ జోడీ చేతిలో కంగుతిన్నారు.