BCCI : ముక్కోణపు వన్డే సిరీస్ ఛాంపియన్‌గా నిలిచిన భారత మహిళల జట్టు మరో సిరీస్‌కు సిద్ధమవుతోంది. అది కూడా స్వదేశంలో బలమైన ఆస్ట్రేలియా(Australia)ను హర్మన్‌ప్రీత్ కౌర్ సేనతో తలపడనుంది. మూడు వన్డేల సిరీస్ కోసం ఆసీస్ బృందం సెప్టెంబర్‌లో భారత్‌కు రానుంది. ఈ మేరకు గురువారం బీసీసీఐ (BCCI) షెడ్యూల్ విడుదల చేసింది.
పర్యాటక ఆస్ట్రేలియాతో సెప్టెంబర్ 14న టీమిండియా తొలి వన్డే ఆడనుంది. ఆ తర్వాత 17న రెండో వన్డే, 20న మూడో వన్డేలు నిర్వహించనున్నారు. ఈ మూడు మ్యాచ్‌లు కూడా చెన్నైలోని చిదంబరం మైదానంలోనే జరుగున్నాయి. నిరుడు డిసెంబర్లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది.
అయితే.. మూడు వన్డేల సిరీస్‌లో ఆసీస్ జోరు చూపించి టీమిండియాను వైట్‌వాష్ చేసింది. సొంతగడ్డపై సెప్టెంబర్‌లో జరుగబోయే వన్డే వరల్డ్ కప్ సన్నద్ధతగా టీమిండియాకు ఈ సిరీస్ ఎంతో ఉపయోగపడనుంది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 29 నుంచి ఆక్టోబర్ 26 వరకూ వరల్డ్ కప్ టోర్నీ జరుగనుంది.
NEWS – BCCI announces fixtures for Australia Women’s, Australia Men’s A and South Africa Men’s A team tours of India.
More details here 👇👇https://t.co/91VdIwo32r #TeamIndia
— BCCI (@BCCI) May 29, 2025
మరోవైపు పురుషుల జట్టు కూడా వరుస సిరీస్‌లతో బిజీగా ఉండనుంది. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ముగియగానే స్వదేశంలో ఆస్ట్రేలియా ఏ జట్టుతో సెప్టెంబర్‌లో రెండు అనధికారిక నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మ్యాచ్‌లకు లక్నో వేదికగా జరుగనుండగా.. తదుపరి మూడు వన్డేలు కాన్పూర్‌లో నిర్వహించనున్నారు. అనంతరం.. దక్షిణాఫ్రికా ఏ జట్టుతో రెండు టెస్టులు.. ఆపై మూడు వన్డే మ్యాచ్‌లకు బెంగళూరులోని చిన్నస్వామి స్వామి స్టేడియం వేదిక కానుంది.