Kunjam Hidma | మావోయిస్టు కీలక నేత కుంజాం హిడ్మా అరెస్ట్
Kunjam Hidma | మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఎన్కౌంటర్ అయిన ఘటన మరువక ముందే.. మరో కీలక నేతను ఒడిశా పోలీసులు అరెస్టు చేశా
Kunjam Hidma | భువనేశ్వర్ : మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఎన్కౌంటర్ అయిన ఘటన మరువక ముందే.. మరో కీలక నేతను ఒడిశా పోలీసులు అరెస్టు చేశారు. ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలోని జనగూడకు చెందిన కుంజాం హిడ్మాను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఒడిశా పోలీసులు, డిస్ట్రిక్ట్ వాలంటరీ ఫోర్స్ బృందాలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో బోయిపరిగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని పెటగూడ గ్రామ సమీపంలోని అడవుల్లో హిడ్మాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారని పక్కా సమాచారం అందడంతోనే.. పోలీసులు అక్కడ కూంబింగ్ నిర్వహించినట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
కూంబింగ్ నిర్వహిస్తుండగా పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో మావోయిస్టులకు, పోలీసు బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. అయితే చాలా మంది మావోయిస్టులు అక్కడ్నుంచి పారిపోయారు. మావోయిస్టు కుంజాం హిడ్మా మాత్రం అక్కడున్న చెట్ల పొదల్లో తలదాచుకున్నాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతను హార్డ్‌కోర్ మావోయిస్టు హిడ్మా అని పోలీసుల విచారణలో తేలింది.

కుంజాం హిడ్మా ప్రస్తుతం ఏరియా కమిటీ మెంబర్‌గా కొనసాగుతున్నారు. హిడ్మా నుంచి ఏకే 47 రైఫిల్, 35 రౌండ్ల బుల్లెట్లు, 27 ఎలక్ట్రానిక్ డిటోనేటర్స్, 90 నాన్ ఎలక్ట్రిక్ డిటోనేటర్స్, 2 కేజీల గన్ పౌడర్, రెండు స్టీల్ కంటైనర్స్, రెండు రేడియోలు, ఒక ఇయర్ ఫోన్, వాకిటాకీ, బ్యాటరీ, రెండు కత్తులు, గొడ్డలి, నాలుగు టార్చ్ లైట్లు, ఒక పాలిథీన్ కవర్, మావోయిస్టు సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు లభించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

