Sanju Samson : దసరా పండుగ రోజు ఉప్పల్ స్టేడియం దద్దరిల్లిపోయింది. క్రికెట్ అభిమానులున ఆనందోత్సాహాల్లో ముంచేస్తూ భారత జట్టు రికార్డు స్కోర్ కొట్టింది. ఇదంతా.. ఒకేఒక్కడితోనే మొదలైంది. అతడే సంజూ శాంసన్ (Sanju Samson) ఇన్నాళ్లు ‘అవకాశాలు ఇచ్చినా ఉపయోగించుకోలేడు’.. అనే ముద్ర పడిన సంజూ విశ్వరూపం చూపించాడు. బ్యాటర్లకు స్వర్గధామమైన ఉప్పల్ పిచ్ మీద శివతాండవం చేస్తూ.. బంగ్లాదేశ్ బౌలర్లను ఉతికేస్తూ అంతర్జాతీ టీ20ల్లో మొదటి శతకం.. పొట్టి ఫార్మాట్లో రెండో వేగవంతమైన వంద కొట్టేశాడు. సెంచరీ కాగానే తన కండబలం చూపిస్తూ.. నాలుకను ముందుకూ వెనక్కీ ఆడిస్తూ సెలబ్రేట్ చేసుకోవడం ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. ఎక్స్ వేదికగా అభిమానులు అతడిని పొగిడేస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు.
భారత జట్టులోకి వస్తూ పోతుండే శాంసన్.. భారీ ఇన్నింగ్స్‌తో తన ఉనికిని చాటాడు. వికెట్ కీపర్, బ్యాటర్‌గా రిషభ్ పంత్ (Rishabh Pant) స్థానం పదిలం చేసుకుంటున్న వేళ.. ‘నేనూ ఖతర్నాక్ ఇన్నింగ్స్‌లు ఆడగలను’ అని చాటాడు. తన మెరుపులతో.. శనివారం.. దసరా సంబురాల్లో మునిగిపోయిన అభిమానులను టీవీలకు అతుక్కుపోయేలా చేశాడు.
A perfect finish to the T20I series 🙌#TeamIndia register a mammoth 133-run victory in the 3rd T20I and complete a 3⃣-0⃣ series win 👏👏
Scorecard – https://t.co/ldfcwtHGSC#INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/BdLjE4MHoZ
— BCCI (@BCCI) October 12, 2024
It’s been over 12 hours, but still you cannot get over this shot of Sanju Samson. 🥶
– Ridiculous power of Samson! 🤯pic.twitter.com/28uiaV5UgA
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 13, 2024
ఉప్పల్ స్టేడియంలో ఈ కేరళ కింగ్ కొనసాగించిన ఆ విధ్వంసాన్ని వర్ణించలేం. అసలు.. టీ20ల్లో ఇలానే ఆడాలి? బంతి గమ్యం ప్రతిసారి బౌండరీయే కావాలి అన్నంతగా శాంసన్ చెలరేగాడు. కేవలం 40 బంతుల్లోనే మెరుపు సెంచరీతో ఔరా అనిపించాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(75) జతగా శాంసన్ చెలరేగగా.. జట్టు స్కోర్ పవర్ ప్లేలో 80 దాటేసింది. 10 ఓవర్లకు 152.
విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన శాంసన్ 13వ ఓవర్లో బౌండరీతో 40 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. రోహిత్ శర్మ (Rohit Sharma), డేవిడ్ మిల్లర్ (David Miller)ల తర్వాత టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ సంజూదే. ఈ ఇద్దరూ 35 బంతుల్లోనే వంద కొట్టేసి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. సునామిలా బంగ్లా బౌలర్లను చుట్టేసిన సంజీ 11 ఫోర్లు, 8 సిక్సర్లుతో విలయం సృష్టించి.. 111 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. అ క్షణం… ఓ తుఫాన్ ఆగినట్టు.. ఓ జడివాన వెలిసినట్టు బంగ్లా బౌలర్లు ఊపిరిపీల్చుకున్నారు.
A memorable evening ✨
Sanju Samson smashed the second fastest T20I century for #TeamIndia, off just 40 deliveries 👏👏
Live – https://t.co/ldfcwtHGSC#INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/UC7Iy1j6yY
— BCCI (@BCCI) October 12, 2024
కానీ, ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, పరాగ్ మెరుపులతో భారత జట్టు ఏకంగా 297 పరుగులతో చరత్రి సృష్టించింది. అనంతరం బంగ్లాను కట్టడి చేసి 133 రన్స్ తేడాతో విజయదుందుభి మోగించింది.. ఇప్పటికే 2-0తో టెస్టు సిరీస్ కొల్లగొట్టిన టీమిండియా.. పొట్టి సిరీస్‌నూ 3-0తో కైవసం చేసుకుంది.