KTR | కాంగ్రెస్ నాయకులను ఈడీ నుంచి రక్షిస్తున్న పెద్దన్న ఎవరు?: కేటీఆర్
KTR | కాంగ్రెస్, బీజేపీ బంధంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులపై ఈడీ దాడులు జరుగుతున్నా ఎవరూ నోరు మెదపడం లేదని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ నాయకులను ఈడీ నుంచి రక్షిస్తున్న పెద్దన్న ఎవరని నిలదీశారు.
KTR | కాంగ్రెస్, బీజేపీ బంధంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులపై ఈడీ దాడులు జరుగుతున్నా ఎవరూ నోరు మెదపడం లేదని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ నాయకులను ఈడీ నుంచి రక్షిస్తున్న పెద్దన్న ఎవరని నిలదీశారు.
ఫిక్షన్ కంటే వాస్తవం వింతగా ఉంటుందని అంటుంటారని.. రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే దాన్ని నమ్మక తప్పడం లేదని కేటీఆర్ అన్నారు. అందుకు సంబంధించిన రెండు ఘటనలను ట్విట్టర్(ఎక్స్) ద్వారా వివరించారు. తెలంగాణలో ఒక సంపన్నమైన కాంగ్రెస్ మంత్రి నివాసంలో రెండు వారాల కిందట ఈడీ దాడి చేసిందని తెలిపారు. ఆ దాడిలో వందల కోట్ల నగదు దొరికిందని మీడియాలో కథనాలు వస్తున్నాయని అన్నారు. అయితే ఇప్పటికీ కాంగ్రెస్ గానీ.. బీజేపీ నుంచి గానీ.. ఈడీ నుంచి గానీ దానిపై నోరు మెదపలేదని పేర్కొన్నారు.
కర్ణాటకలో జరిగిన వాల్మీకి కుంభకోణం ద్వారా వచ్చిన 40 కోట్ల అక్రమ ధనాన్ని పార్లమెంటు ఎన్నికల సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ ఉపయోగించిందని ఈడీ వెల్లడించిందని కేటీఆర్ గుర్తుచేశారు. అయితే ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టులు ఏమీ జరగలేదని తెలిపారు. వీటన్నింటి బట్టి ఈడీ నుంచి తెలంగాణలో కాంగ్రెస్ నాయకులను రక్షిస్తున్న పెద్ద అన్న ఎవరై ఉంటారని ప్రశ్నించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

