INDW vs AUSW : మహిళల టీ20 వరల్డ్ కప్ కీలక మ్యాచ్‌లో భారత పేసర్ రేణుకా సింగ్(2/19) నిప్పులు చెరుగుతోంది. డిఫెండింగ్ చాంపియన్, ఈ సీజన్లో హ్యాట్రిక్ విక్టరీలు కొట్టిన ఆస్ట్రేలియా బ్యాటర్లను వణికిస్తోంది. రేణుకా తన రెండో ఓవర్లో రెండు వికెట్లు తీసి.. కంగారూలను ఒత్తిడిలో పడేసింది. వరుస బంతుల్లో ఓపెనర్ బేత్ మూనీ(2), జార్జియా వరేహమ్(0)లను ఔట్ చేసి భారత్‌కు శుభారంభం ఇచ్చింది.
మూడో ఓవర్లో వరుసగా రెండు కీలక వికెట్లు.. అప్పటికీ జట్టు స్కోర్ 17 మాత్రమే. అయితే..ఆ తర్వాత గ్రేస్ హ్యారిస్(16), కెప్టెన్ తహ్లియా మెక్‌గ్రాత్(7)లు ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకొని ఆచితూచి ఆడుతున్నారు. దాంతో, ఆస్ట్రేలియా పవర్ ప్లేలో 2 వికెట్ల నష్టానికి పరుగులు చేసింది.