Rohit Sharma : ప్రపంచ క్రికెట్లో భారత జట్టు అజేయ శక్తిగా అవతరించింది. గత ఏడాది నుంచి వైట్‌బాల్ ఫార్మాట్లో ఓటమన్నదే ఎరుగకుండా దూసుకుపోతోంది టీమిండియా. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్వహిస్తున్న టోర్నమెంట్లలో భారత్ హవా కొనసాగిస్తున్నందకు కెప్టెన్‌గా చాలా గర్వపడుతున్నానని రోహిత్ శర్మ (Rohit Sharma) తెలిపాడు. అయితే.. వన్డేలు, టీ20ల్లో టీమిండియా జైత్రయాత్ర 2022 నుంచే మొదలైంది అంటున్నాడు హిట్‌మ్యాన్. తాజాగా రోహిత్ పే చర్చ వీడియోను ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్న చర్చ విత్ రోహిత్ శర్మ వీడియోలో భారత సారథి ఏం అన్నాడంటే..
‘వైట్‌బాల్ క్రికెట్లో భారత జట్టు ప్రభంజనం 2022 నుంచే మొదలైంది. ఆ ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన పొట్టి ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్లోనే ఇంటిబాట పట్టాం. ఆ పరాజయాన్ని సవాల్‌గా తీసుకున్న మేము.. జట్టులోని ప్రతి ఆటగాడికి తమ బాధ్యతలు ఏంటో స్పష్టంగా వివరించాం. మైదానంలో వాళ్ల నుంచి ఏం ఆశిస్తున్నామో కూడా చెప్పాం. అంతేకాదు భయం, ఒత్తిడి వంటివి లేకుండా స్వేచ్ఛగా ఆడాలని సూచించాం.
On your screens, straight from the heart 🎤💙
Presenting 𝗖𝗵𝗮𝗿𝗰𝗵𝗮 𝘄𝗶𝘁𝗵 𝗥𝗼𝗵𝗶𝘁 𝗦𝗵𝗮𝗿𝗺𝗮 – a special interview where Ro talks all things MI including fond memories and future ambitions ✅#MumbaiIndians #PlayLikeMumbai pic.twitter.com/whKiJjkBma
— Mumbai Indians (@mipaltan) March 29, 2025
అయితే.. ఈ మధ్యలో ఒకటి రెండు సిరీస్‌ల్లో ఓడినంత మాత్రాన మేము కంగారు పడడం లేదు. మా ఆలోచన విధానం చెక్కు చెదరలేదు. ఐసీసీ టోర్నమెంట్లలో ఆడిని 24 మ్యాచుల్లో 23 గెలుపొందడం నిజంగా గొప్ప ఘనత. ఆ ఒక్క ఓటమి కూడా ఆలోచించదగ్గదే. టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా టైటల్ నెగ్గడంతో గాల్లో తేలిపోయాను. అంతేకాదు ఐసీసీ టైటిల్ గెలుపొందిన జట్టు సభ్యులను ప్రత్యేకంగా గౌరవించాలి’ అని రోహిత్ వివరించాడు.
సొంతగడ్డపై వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన టీమిండియా.. 2024లో పంజా విసిరింది. వెస్టిండీస్, అమెరికాలు సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు వరుసగా 8 విజయాలతో విజేతగా అవతరించింది. ఇక 50 ఓవర్ల ఫార్మాట్లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలోనూ.. వరుగా 5 మ్యాచుల్లో గెలుపొందిన రోహిత్ సేన 17 ఏళ్ల తర్వాత ట్రోఫీని ఒడిసిపట్టింది. ఈ విక్టరీతో ధోనీ తర్వాత టీమిండియాకు అత్యధిక ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు.
🇮🇳, this is for 𝐘𝐎𝐔. pic.twitter.com/DSxE2gzgfw
— Rohit Sharma (@ImRo45) July 5, 2024