కొండాపూర్ : నిజాం నిరంకుశ వ్యతిరేక పోరాట యోధుడు, స్వాతంత్ర సమరయోధులు కొండా లక్ష్మణ్ బాపూజీని (Konda Laxman Bapuji) తెలంగాణ జాతిపితగా ప్రకటించాలని హైటెక్ సిటీ కొండా లక్ష్మణ్ బాపూజీఫెడరేషన్ ( Fedaration) రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించింది. ఈ సందర్భంగా ఫెడరేషన్ సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకు అలుపెరుగని పోరాటం చేసిన పోరాట యోధుడు, స్వాతంత్ర సమరయోధుడు లక్ష్మణ్ బాపూజీ అన్నారు. తెలంగాణ ప్రజల కోసం అహర్నిశలు కృషిచేసిన గొప్ప నాయకుడు బాపూజీ పేరును తెలంగాణ జాతిపితగా ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ ఫెడరేషన్ నాయకులు రాపోలు జ్ఞానేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.