ముంబై, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలోని అహల్యానగర్ మాజీ మేయర్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్ వర్గం) నగర జిల్లా అధ్యక్షుడు అభిషేక్ కలాంకర్పై ఎంఐడీసీ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం లైంగిక దాడి కేసు నమోదైంది.
పాఠశాలలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ వివాహితను ఆకర్షించిన కలాంకర్, అహల్యానగర్తో పాటు పుణె జిల్లాలోని శిరూర్లోని ఒక లాడ్జికి ఆమెను తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడు తనతో గంటల తరబడి వీడియో కాల్స్‌లో మాట్లాడేవాడని.. తరచూ తనను దుస్తులు విప్పించి అలాగే వీడియో కాల్ మాట్లాడించేవాడని బాధితురాలు వాపోయింది. వీడియో ఆధారాలను కూడా ఆమె పోలీసులకు సమర్పించింది. నిందితుడు పరారీలో ఉన్నాడు.