Manchu Vishnu | మంచు ఫ్యామిలీ నుంచి వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కన్నప్ప (Kannappa). దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నిర్మిస్తుండగా.. మంచు విష్ణు (Manchu Vishnu) కథానాయకుడిగా నటిస్తున్నాడు. హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ అగ్ర తారలు నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్‌కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమాను మొదటగా ఏప్రిల్ 25న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మూవీని వాయిదా వేసినట్లు మంచు విష్ణు వెల్లడించారు. వీఎఫ్ఎక్స్ ఆలస్యం అవుతుండడంతో ఈ మూవీని వాయిదా వేసినట్లు విష్ణు ప్రకటించాడు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ప్రెస్ నోట్ విడుదల చేశాడు.
ప్రియమైన అభిమానులకు, సినీ ప్రేమికులకు విజ్ఞప్తి.. కన్నప్ప పోస్ట్ ప్రోడక్షన్ పనలు అద్భుతంగా సాగుతున్నాయి. ఈ సినిమాను అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నాం. ఈ ప్రాజెక్ట్ గొప్పగా రావడానికి మాకు మరింత సమయం పట్టేలా ఉంది. ఎందుకంటే ఒక ముఖ్యమైన ఎపిసోడ్‌కు మంచి VFX అవసరం. దాని వలన సమయం పడుతుంది. మూవీ విడుదల ఆలస్యం అవుతున్నందుకు అభిమానులకు, సినీ ప్రియులకు క్షమాపణలు చెబుతున్నాం. త్వరలోనే కొత్త తేదీతో మీ ముందుకు వస్తామంటూ విష్ణు రాసుకోచ్చాడు.
My Sincere Apologies! pic.twitter.com/WbAUJIVzHq
— Vishnu Manchu (@iVishnuManchu) March 29, 2025