IPL 2025 : గత ఐపీఎల్ సీజన్లో గడ్డు రోజులు ఎదుర్కొన్న హార్దిక్ పాండ్యా(Hardhik Pandya) మళ్లీ కెప్టెన్‌గా మైదానంలో అడుగుపెడుతున్నాడు. స్లో ఓవర్ రేటు కారణంగా ఒక మ్యాచ్ నిషేధం విధించడంతో పాండ్యా 18వ సీజన్ తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు. శనివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటన్స్.. తన పాత టీమ్‌తో మ్యాచ్‌లో పాండ్యా ముంబై కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అయితే.. ఈసారి అహ్మదాబాద్ ఫ్యాన్స్ పాండ్యాను ఎలా ట్రీట్ చేస్తారు? అనేది అసక్తికరం.
ఐపీఎల్ సీజన్ 2022లో గుజరాత్ టైటన్స్‌కు ట్రోఫీ సాధించాడు హార్దిక్ పాండ్యా. 16వ సీజన్లోనూ జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లాడు. అయితే.. 17వ సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ అతడిని సొంతం చేసుకుంది. రోహిత్‌ను తప్పించి సారథ్య బాధ్యతలు అప్పగించింది. దాంతో, అహ్మదాబాద్ వాసులు అతడిని టార్గెట్ చేశారు. నిరుడు నరేంద్ర మోడీ స్టేడియంలో పాండ్యా టాస్కు వచ్చినప్పుడు స్టేడియంలోని ప్రేక్షకులంతా అతడిని ఛీ కొడుతూ.. హేళన చేశారు. వాళ్ల మాటల ప్రభావంతో.. డ్రెస్సింగ్ రూమ్‌లో సహకారం కరువవ్వడంతో కెప్టెన్‌గా, ఆటగాడిగా విఫలమయ్యాడు పాండ్యా. కానీ, ఇప్పుడు సీన్ మారింది.
Hardik Pandya was booed by the home crowd when he last played an IPL game in Ahmedabad 👀
🔗 https://t.co/ELLjFZZvjc | #IPL2025 pic.twitter.com/vqLv9SPcGL
— ESPNcricinfo (@ESPNcricinfo) March 29, 2025
గత ఏడాదితో పోల్చితో పాండ్యాలో ఎంతో మార్పు వచ్చింది. ఐపీఎల్లో కెప్టెన్‌గా మెప్పించకున్నా.. టీ20 వరల్డ్ కప్‌లో ఖతర్నాక్ ఇన్నింగ్స్‌లు ఆడాడు హార్దిక్ . ఇక బార్బడోస్‌లో దక్షిణాఫ్రికాతో హోరాహోరీగా జరిగిన ఫైనల్లో సూపర్ బౌలింగ్‌తో డేంజరస్ డేవిడ్ మిల్లర్ వికెట్ తీశాడు. అంతేకాదు చాంపియన్స్ ట్రోఫీ విజయంలో పాండ్యా కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం నేషనల్ హీరోగా మారిన అతడు ఐపీఎల్18వ సీజన్లో తొలి మ్యాచ్‌కు సిద్ధమవుతున్నాడు. సో.. ఈ ఆల్‌రౌండర్‌ను అహ్మదాబాద్ ఫ్యాన్స్.. మునపటిలానే గేళి చేస్తారా? లేదంటే వరల్డ్ కప్ హీరో అంటూ జేజేలు పలుకుతారా? అనేది చూడాలి.
18వ సీజన్ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిన ముంబై ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే కసితో ఉంది. గుజరాత్‌ది కూడా అలాంటి పరిస్థితే. పంజాబ్ కింగ్స్ చేతిలో 11 పరుగుల తేడాతో ఓటమి పాలైన శుభ్‌మన్ గిల్ బృందం సొంత ఇలాకాలో ఖాతా తెరవాలనే పట్టుదలతో ఉంది. ఇక రికార్డులు చూస్తే.. ముంబైపై గుజరాత్‌దే ఆధిపత్యం. రెండు జట్లు 5సార్లు తలపడగా.. గుజరాత్ మూడు విజయాలు సాధించింది. ఇక అహ్మదాబాద్‌లో మూడు పర్యాయాలు ముంబైని ఓడించింది ఆతిథ్య జట్టు. అంతేకాదు ప్రతిసారి మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ గెలవడం విశేషం. దాంతో, ఈసారి కూడా టాస్ కీలకం కానుంది.