JAGITYAL |జగిత్యాల, మార్చి 29 : బాల్య స్నేహితుడు అబ్దుల్ రజాక్ ఇటీవల స్ట్రోక్ కారణంగా ఆసుపత్రి పాలయ్యాడు. అతడి పరిస్థితి స్పందించిన శారద విద్యా నిలయం స్కూల్ యొక్క 1992-93 పదో తరగతి బ్యాచ్‌కు చెందిన అతని బ్యాచ్‌మేట్స్ సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.
వేర్వేరు ప్రాంతాలతో పాటు విదేశాల్లో సైతం స్థిర పడిన వారందరూ కలిసి బాధితుడికి సాయం చేసేందుకు రూ. 66 వేలు సేకరించి బాధిత కుటుంబానికి శనివారం అందజేశారు. కాగా రజాక్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మిత్రులు ఎర్ర రంజిత్, దొంతుల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.